మిల్కీ బ్యూటీ తమన్నా ఆస్తులపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు దగ్గరకు వచ్చాయి. అయినప్పటికీ ఆమె కెరీర్ ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అమ్మడు ఎంత డబ్బు వెనకేసిందని నెట్టింట ఆమె అభిమానులు సెర్చ్ చేస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా గత 18 సంవత్సరాలుగా అటు టాలీవుడ్ తో పాటు తమిళ, హిందీ సినిమాల్లో సైతం అదరగొట్టేస్తూ విజయకేతనం ఎగురేస్తున్నారు. ఇప్పుడు సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్ ఫాంలలో సైతం ఆమె సందడి చేస్తోంది. ఈ 33 ఏళ్ల ముదురు భామ లేలేత ప్రాయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. ముచ్చటగా రెండు దశాబ్దాల కెరీర్ ను పూర్తి చేసుకోబోతోంది. అయితే ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అక్షరాల పాటిస్తోంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా చక్కగా సినిమాలు, అడ్వర్టైజ్మెంట్లు, వెబ్ సిరీస్ లలో చేసుకుంటూ పోతోంది. ఈ సందర్భంగా అమ్మడు ఎంత సంపాదిస్తుందా అనే ఆలోచన అందరికీ కలిగే అవకాశం ఉంది.
తమన్నా ఆస్తుల విలువ ఎంత..? ఒక్కో సినిమాకు ఎంత వసూలు చేస్తుంది..?
తాజాగా ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం తమన్నా భాటియా ఆస్తుల విలువ సుమారు రూ.120 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె ప్రతినెల రెండు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ల రూపంలో ఆదాయం సంపాదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఆమె ఏటా 16 కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అంతేకాదు ఆమె ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమన్నా యాడ్స్ రూపంలో కూడా భారీగానే సంపాదిస్తోంది. ఒక్కో అడ్వర్టైజ్మెంట్ కు రెండు నుంచి మూడు కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్టేజ్ షో లలో కూడా తమన్నా తళుక్కుమంటుంది. ఈ స్టేజ్ షోలలో ఒక్క రోజుకే ఒక కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తున్నట్లయితే అమ్మడు దాదాపు 100 కోట్లకు పైగానే ఆస్తుల్ని కూడా పెట్టడం పెద్ద కష్టమేమీ కాదని అర్థం చేసుకోవచ్చు.
2005 సంవత్సరంలో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు కేవలం 15 సంవత్సరాలకే తెరపై కనిపించింది ఆ తరువాత 2006 సంవత్సరంలో టాలీవుడ్ లో ప్రవేశించింది 2007 సంవత్సరంలో విడుదలైనటువంటి హ్యాపీడేస్ చిత్రం అమ్మడు కెరీర్ మార్చేసింది ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఇప్పటికే ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ అందరితో నటించింది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు అందరితోనూ అమ్మడు జతకట్టింది. ఇక తమిళంలో కూడా సూపర్ స్టార్ స్థాయి ఉన్న నటులందరితోనూ తమన్నా తళుక్కుమంది. బాలీవుడ్ లో కూడా అమ్మడి హవా ఏం తగ్గలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా తమన్న తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
ఇక తమన్నా తన పెట్టుబడుల విషయానికి వచ్చినట్లయితే వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక ఆన్లైన్ జ్యువెలరీ స్టోర్ ను నడిపిస్తోంది. అలాగే ముంబైలోని వర్సోవ ఏరియాలో ఒక విలాసమైతమైన లగ్జరీ ఫ్లాట్ తమన్నా సొంతం చేసుకుంది. దీని విలువ దాదాపు 20 కోట్లు. అలాగే తమన్నా వద్ద లగ్జరీ కార్డులు సైతం ఉన్నాయి. వీటిలో బీఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.