కేంద్ర బడ్జెట్... ప్రభుత్వం కురిపించిన వరాలు ఇవే..

By telugu teamFirst Published Jul 5, 2019, 11:58 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని శుక్రవారం ప్రవేశపెట్టింది. తొలిసారి బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ చదివి వినిపించారు. చాలా ఆసక్తిగా ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. చి

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని శుక్రవారం ప్రవేశపెట్టింది. తొలిసారి బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ చదివి వినిపించారు. చాలా ఆసక్తిగా ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. పారిశ్రామికవాడల ఏర్పాటుతో మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమైందని, ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. సంపదను సృష్టించడంలో మేకిన్‌ ఇండియా ప్రధాన పాత్ర పోషించిందని నిర్మల తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలను ఆమె ప్రస్తావించారు. కాగా... బడ్జెట్ లో భాగంగా ప్రభుత్వం కురిపించిన వరాలు ఇవే..

1.వాణిజ్య అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేస్తాం
2.ఉడాన్‌ స్కీమ్‌తో చిన్న నగరాలకు విమాన సర్వీసులు
3.చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యత
4.విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి
5.పారిశ్రామిక సంస్థలు సంపద, ఉపాధిని సృష్టిస్తున్నాయి
6.సాగరమాల ద్వారా జలరవాణా మెరుగుపడుతోంది
7.గంగానదిలో సరకుల రవాణా నాలుగురెట్లు పెంచుతాం
8.విద్యుత్‌ వాహన వినియోగదారులకు ఇన్సెంటివ్‌లు
9.ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్లలో అనేక మార్పులు తెచ్చాం
10.రైల్వేల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
11.రవాణా రంగం కోసం కొత్త రూపీ కార్డు
12.ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం మూడేళ్లలో రూ.10వేల కోట్లు
13.జాతీయ రహదారుల గ్రిడ్‌ ఏర్పాటు
14.విద్యుత్‌ టారిఫ్‌ పాలసీలో సంస్కరణలు అవసరం
15.కోటిన్నర మంది చిరు వ్యాపారులకు పెన్షన్‌ పథకం
16.గ్యాస్‌ గ్రిడ్‌ హైవేల కోసం బ్లూ ప్రింట్‌
1.రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
18.చిన్నతరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణం
19.జీఎస్టీలో నమోదు చేసుకున్నవారికి 2శాతం వడ్డీ రాయితీ
20.చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థికసాయం కోసం రూ.350కోట్లు
21.జాతీయ హౌసింగ్‌ రెంటల్‌ విధానం

click me!