June Bank Holidays: జూన్ నెలలో బ్యాంకుల సెలవులు ఇవే..ముందుగానే బ్యాంకు పనులుంటే ప్లాన్ చేసుకోండి..

By Krishna Adithya  |  First Published May 25, 2023, 12:30 AM IST

మే నెల ముగింపునకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పని చేస్తాయో, ఎన్ని రోజులు సెలవులు తీసుకుంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా మీరు బ్యాంకింగ్ పనులను ప్లాన్ చేసుకునే వీలు కలుగుతుంది.


మే నెల ముగిసిపోయేందుకు ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది జూన్ ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో మీరు బ్యాంకు పనులు ఏవైనా ఉన్నట్లయితే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెలలో ఏకంగా 12 రోజులపాటు బ్యాంకులు సెలవుల కారణంగా పనిచేయవు.  అందుకే జూన్ నెలలో ఆర్బిఐ అప్రూవ్ చేసినటువంటి సెలవల జాబితాను ఇక్కడ ఉంచాము. తద్వారా మీ మీ రాష్ట్రాల్లో బ్యాంకులు ఏ రోజు పనిచేస్తాయో, ఏరోజు పనిచేయవు పూర్తి వివరాలు ఈ జాబితా ద్వారా తెలుసుకోవచ్చు. 

అయితే బ్యాంకు సెలవు దినం రోజు ఏటీఎంలు అదేవిధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు పనిచేస్తాయి. అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అలాగే ప్రతి నెల రెండవ శనివారము, నాలుగవ శనివారము బ్యాంకును మూసివేస్తారు. దీంతో పాటు  నెలలోని అన్ని ఆదివారాలు బ్యాంకులు మూతపడతాయి. ఇక జూన్ నెలలో పెద్ద పండగల విషయానికి వస్తే జూన్ 28న బక్రీద్ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు  అన్న విషయం గమనించాలి. 

Latest Videos

మీరు ఒకవేళ బ్యాంకుకు వెళ్లాల్సి ఉన్న పని ఉంటే కింద పేర్కొన్నటువంటి సెలవుల జాబితాను బేరీజు వేసుకొని బ్యాంకుకు  వెళ్లే పనిని ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే అనవసరంగా శ్రమ వృధా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో దాదాపు బ్యాంకుకు సంబంధించిన అన్ని పనులు కూడా ఆన్లైన్ ద్వారా జరిగిపోతున్నాయి. అయినప్పటికీ, చాలామంది తమ పనుల కోసం ఇప్పటికీ బ్యాంకు ను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా లోన్ అప్లై చేసుకోవడానికి,  లేదా బ్యాంకులో బంగారం నగలను తనఖా పెట్టుకోవడానికి,  లేదా లాకర్లో తమ విలువైన వస్తువులను దాచుకోవడానికి, ఇలా వివిధ పనుల కోసం బ్యాంకులకు కస్టమర్లు వస్తూ ఉంటారు అందుకే సెలవుల జాబితాను ముందుగానే చూసుకోవడం ద్వారా వారికి సమయం వృధా కాదు. 

జూన్ బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి:

జూన్ 4: ఆదివారం

జూన్ 10: రెండవ శనివారం

జూన్ 11: ఆదివారం

జూన్ 15: గురువారం (మిజోరం, ఒడిశా)

జూన్ 18: ఆదివారం

జూన్ 20: కాంగ్ (రథజాత్ర లేదా రథయాత్ర. ఒడిషా , మణిపూర్ )

జూన్.24: నాల్గవ శనివారం

జూన్.25: ఆదివారం

జూన్.26: ఖర్చీ పూజ (త్రిపుర)

జూన్.28: బక్రీద్ (మహారాష్ట్ర, జమ్మూ, కాశ్మీర్, కేరళ)

జూన్.29: బక్రీద్ (దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో)

జూన్. 30: రెమ్నా ని/ఈద్-ఉల్-అధా (మిజోరం మరియు ఒడిశా)

click me!