అయ్యో పాపం...ఒక్క రోజులోనే 90 వేల కోట్లు నష్టపోయిన ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్...కారణం ఇదే..

By Krishna Adithya  |  First Published May 24, 2023, 6:25 PM IST

ప్రపంచంలోని లగ్జరీ బ్రాండ్లలో ఒకటైన లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఒక్క రోజులో 11.2 బిలియన్ అమెరికన్ డాలర్లు కోల్పోయాడు. ఈ మొత్తాన్ని భారతీయ రూపాయిలలో వ్యక్తీకరించినట్లయితే, వారు రూ.92,620 కోట్ల మొత్తాన్ని కోల్పోయారు.


అమెరికాను ముంచెత్తుతున్న ఆర్థిక సంక్షోభం క్రమంగా సంపన్నుల సంపదకు కూడా సెగపెడుతోంది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న బెర్నార్డ్ ఆర్నాల్డ్ సంపద  ఒక్కసారిగా  కుప్ప కూలిపోయింది. ఒకటి కాదు రెండు కురాదు ఒక్కరోజులోనే 11 బిలియన్ డాలర్లు సంపద ఆవిరి అయిపోయింది. అంటే భారతీయ కరెన్సీలో పోల్చి చూస్తే దాదాపు 90000 కోట్ల రూపాయలు ఆయన సంపద నుంచి తుడిచిపెట్టుకుపోయాయి. 

లగ్జరీ ఉత్పత్తులకు పేరెన్నికగన్న LVMH  కంపెనీ అధినేత అయిన ఆర్నాల్డ్ గత  కొంత కాలం క్రితం ఎలాంటి మస్కును కాదని ఏకంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా పేరు పొందారు.  అయితే తాజాగా అమెరికాలో ఉన్న సంక్షోభం దెబ్బకు ఆయన కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్లో జోరుగా చర్చ మొదలైంది ఒక్కసారిగా ఆయన కంపెనీ షేర్లు నేల మార్గం పడ్డాయి అంతేకాదు ఒక్కసారిగా ఆయన సంపద 11 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది అమెరికాలో మాంద్యం ముదురుతుందనే భయంతో మధుపరులు మార్కెట్లో బేరీష్ గా వ్యవహరిస్తున్నారు. . ఇదిలా ఉంటే లగ్జరీ ఉత్పత్తులకు వివిధ రకాల బ్రాండ్లకు  పేరెన్నిక గన్న ఎల్విఎంహెచ్  సంస్థ గడచిన సంవత్సరంలో ఏకంగా 25 శాతం  వృద్ధిని నమోదు చేసింది. 

Latest Videos

అమెరికా ఆర్థిక వ్యవస్థ. US ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉన్నందున, లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుందని అంచనాలతో ఇది LVMH షేర్లపై ప్రత్యక్ష ప్రభావం పడింది. LVMH లూయిస్ విట్టన్ యొక్క ఆకర్షణీయమైన హ్యాండ్‌బ్యాగ్‌లు Moët,షాంపైన్,  డియోర్ గౌన్‌లను తయారు చేస్తుంది. గత ఏడాది పొడవునా మంచి వృద్ధిని  చూసింది. 

అయితే మంగళవారం నాడు పారిస్‌లో, LVMH షేర్లు 5 శాతం పడిపోయాయి. గత ఏడాది కాలంలో ఇదే అత్యధికం. యూరోపియన్ లగ్జరీ సెక్టార్‌లో మొత్తం 30 బిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోయాయి. బెర్నార్డ్ ఆర్నాల్ట్  గతంలో హిండెన్‌బర్గ్ నివేదిక ప్రచురించబడినప్పుడు, గౌతమ్ అదానీ  ఏ స్థాయిలో నష్టపోయారో అంత పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, లూయిస్ విట్టన్ కంపెనీ షేర్ల ఒత్తిడి మధ్య  ప్రపంచ సంపన్నుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న టెస్లా  వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్ మధ్య అంతరం 11.4 బిలియన్ అమెరికన్ డాలర్లకు తగ్గింది.

click me!