jobs in IT companies:ఈ ఆర్థిక సంవత్సరంలో టి‌సి‌ఎస్-ఇన్ఫోసిస్ పెద్ద ప్లాన్.. 90 వేల మందికి ఉపాధి..

Ashok Kumar   | Asianet News
Published : Apr 30, 2022, 03:58 PM IST
jobs in IT companies:ఈ ఆర్థిక సంవత్సరంలో టి‌సి‌ఎస్-ఇన్ఫోసిస్ పెద్ద ప్లాన్.. 90 వేల మందికి ఉపాధి..

సారాంశం

అధిక అట్రిషన్ రేటును ఎదుర్కొంటున్న ప్రధాన ఐ‌టి కంపెనీలు టి‌సి‌ఎస్, ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 90వేల ఫ్రెషర్‌లను రిక్రూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. దీని కింద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 40వేల మందిని రిక్రూట్ చేసుకోనుండగా, ఇన్ఫోసిస్ 50వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐటీ రంగంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు 90వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవడానికి ప్లాన్ చేశాయి. 

అట్రిషన్ రేటులో గణనీయమైన పెరుగుదల
ప్రతిభను వెతకడానికి ఐటీ కంపెనీల మధ్య పోటీ నెలకొనడం గమనార్హం. ఒకవైపు ఉద్యోగం వదిలేసే వృత్తినిపుణుల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు కంపెనీలు రిక్రూట్‌మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగాలు విడిచిపెట్టిన నిపుణుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది, అయితే TCS కూడా అధిక అట్రిషన్ రేట్లను ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్, టిసిఎస్  ఉద్యోగాలను విడిచిపెట్టే నిపుణుల సంఖ్య పరంగా ముందంజలో ఉండగా, ఇతర కంపెనీలలో ఇలాంటి కదలికలు తీవ్రమవుతున్నాయి. 

ఇన్ఫోసిస్ 50వేల మందిని రిక్రూట్ 
ఇటీవలి నివేదిక ప్రకారం, 2022 చివరి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు గత త్రైమాసికంలో 25.5 శాతం నుండి 27.7 శాతానికి పెరిగింది. దీని కారణంగా, ఇప్పుడు ఇన్ఫోసిస్ రిక్రూట్‌మెంట్ కార్యకలాపాలను పెంచడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసింది, దీని కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 50వేల  మందికి పైగా ఉద్యోగులను తీసుకోనున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు 85 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నాయి. ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ దశలవారీగా ఆఫీస్ నుండి వర్క్ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ మాట్లాడుతూ, “గత సంవత్సరం, మేము భారతదేశం అంతటా ఇంకా ప్రపంచవ్యాప్తంగా 85వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకున్నాము, ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్నాము అని అన్నారు.

టి‌సి‌ఎస్ పెద్ద లక్ష్యాన్ని 
ఇన్ఫోసిస్ లాగానే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా  ఉద్యోగాలను విడిచిపెట్టే నిపుణుల ప్రవాహాన్ని ఎదుర్కొంటోంది. దీని కారణంగా, కంపెనీ పెద్ద సంఖ్యలో కొత్త రిక్రూట్‌మెంట్ ప్లాన్‌లను కూడా సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం తెలిపారు. ఒక వేళ అవసరమైతే ఈ ఏడాదిలో రిక్రూట్‌మెంట్ సంఖ్య  పొడిగిస్తామని తెలిపారు. TCS '25X25' మోడల్‌ను స్వీకరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి తీసుకురావడం, క్రమంగా హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారడం దీని లక్ష్యం. మోడల్ ప్రకారం, 2025 నాటికి కంపెనీ ఉద్యోగులలో 25 శాతం కంటే ఎక్కువ మంది   ఆఫీస్ నుండి పని చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా ఒక ఉద్యోగి తమ సమయాన్ని 25 శాతానికి మించకుండా కార్యాలయంలో గడపవలసి ఉంటుంది.

హెచ్‌సి‌ఎల్ లో హైబ్రిడ్ మోడ్  
ఇదిలావుండగా ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సిఎల్ కూడా హైబ్రిడ్ మోడ్‌లో  కార్యకలాపాలను కొనసాగిస్తుందని, ఉద్యోగుల భద్రత, శ్రేయస్సు కంపెనీ  ముఖ్య ప్రాధాన్యత అని నివేదించింది. మా ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత ఇంకా శ్రేయస్సు మా ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి అని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు