షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై ఇన్ఫోసిస్ బోర్డు.. రెండు రోజుల్లో కీలక నిర్ణయం..

By asianet news teluguFirst Published Oct 11, 2022, 10:23 AM IST
Highlights

షేర్ బైబ్యాక్ లేదా రీపర్చేజ్ కింద ఒక కంపెనీ పెట్టుబడిదారులు లేదా వాటాదారుల నుండి స్వంత షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. వాటాదారులకు డబ్బును తిరిగి ఇవ్వడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ, పన్ను-సమర్థవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది.

న్యూఢిల్లీ:భారతదేశ రెండవ అతిపెద్ద ఐ‌టి సర్వీస్ ప్రొవైడర్ ఇన్ఫోసిస్ అక్టోబర్ 13న జగరనున్న బోర్డు సమావేశంలో బైబ్యాక్ ప్రతిపాదన పై బోర్డు నిర్ణయం తీసుకుంటుందని  సోమవారం తెలిపింది.

 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బయ్-బ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్)కి అనుగుణంగా గురువారం జరిగే సమావేశంలో కంపెనీ బోర్డు ఫుల్ పేడ్ అప్ ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అక్టోబర్ 13న కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను బోర్డు ఖరారు చేయనుంది.

షేర్ బైబ్యాక్ లేదా రీపర్చేజ్ కింద ఒక కంపెనీ పెట్టుబడిదారులు లేదా వాటాదారుల నుండి స్వంత షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. వాటాదారులకు డబ్బును తిరిగి ఇవ్వడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ, పన్ను-సమర్థవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది.

ఇన్ఫోసిస్ షేర్లు BSE సెన్సెక్స్ ఇండెక్స్‌లో 0.95 శాతం పెరిగి యూనిట్‌కు  రూ.1,465 వద్ద ముగిసింది.గత సంవత్సరం జూన్ 25న ప్రారంభమైన రూ.9,200 కోట్ల వరకు బైబ్యాక్ ప్లాన్‌ని ఇన్ఫోసిస్ బోర్డు ఆమోదించింది.

click me!