క్రూడాయిల్ ధర పతనం.. నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇవే..

Published : Oct 11, 2022, 08:47 AM ISTUpdated : Oct 11, 2022, 08:48 AM IST
క్రూడాయిల్ ధర  పతనం.. నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇవే..

సారాంశం

నాలుగైదు నెలల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ఇంధన ధరలు దిగోచ్చాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై లీటరుకు రూ.8 తగ్గింది.  దీని తర్వాత మహారాష్ట్ర, మేఘాలయలో  పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు వచ్చింది. 

క్రూడాయిల్ ధర రికార్డు స్థాయికి పడిపోయిన తరువాత గత కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతోంది. మరోవైపు OPEC దేశాలు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి, దీని కారణంగా కూడా ధర మళ్లీ పెరుగుతుంది. అయితే, మంగళవారం ఉదయం క్రూడాయిల్ ధరలో కాస్త పతనం కనిపించింది. అయితే పెట్రోలు-డీజిల్ ధరలు గత నాలుగైదు నెలలుగా స్థిరంగా ఉన్నాయి. క్రూడాయిల్ ధరలో హెచ్చు తగ్గుల మధ్య  నేడు పెట్రోలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

పెట్రోలు లీటరుకు 
నాలుగైదు నెలల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ఇంధన ధరలు దిగోచ్చాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై లీటరుకు రూ.8 తగ్గింది.  దీని తర్వాత మహారాష్ట్ర, మేఘాలయలో  పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు వచ్చింది. తాజాగా చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించిన సంగతి మీకు తెలిసిందే.

ముడి చమురు తాజా ధర 
సోమవారం పతనం తర్వాత WTI క్రూడ్ తాజా రేటు బ్యారెల్‌కు $ 90.64కి చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 95.69 డాలర్లకు చేరుకుంది. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు జరిగింది. అయితే మేఘాలయలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధర ఒకటిన్నర రూపాయలు పెరిగింది.

అక్టోబర్ 11న పెట్రోలు-డీజిల్ ధర
- ఢిల్లీ పెట్రోల్ రూ. 96.72 & డీజిల్ రూ. 89.62 లీటర్‌కు
- ముంబై పెట్రోల్ రూ. 111.35 & డీజిల్ రూ. 97.28 లీటర్‌కు
- చెన్నై పెట్రోలు రూ. 102.63 & డీజిల్ రూ.94.24 లీటరుకు
- నోయిడాలో పెట్రోలు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.96
- లక్నోలో పెట్రోల్ రూ. 96.57, డీజిల్ లీటరుకు రూ . 89.76
- జైపూర్‌లో పెట్రోల్ రూ. 108.48, డీజిల్ రూ.93.72
 -పాట్నాలో పెట్రోల్ రూ. 107.24, డీజిల్ లీటరుకు రూ. 94.04
- గురుగ్రామ్‌లో రూ. 97.18, డీజిల్ లీటరుకు రూ. 90.05
- బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.94, డీజిల్‌ రూ.87.89
-భువనేశ్వర్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.19, డీజిల్‌ రూ.94.76
-చండీగఢ్‌లో పెట్రోల్‌  రూ .96.20, డీజిల్‌ ధర రూ.84.26
-హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82
 
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఓ‌ఎం‌సిలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. VAT లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు