
IPO ద్వారా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారా, అయితే డబ్బు ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకుంటే, బెంగళూరుకు చెందిన కంపెనీ DCX సిస్టమ్స్ IPO అక్టోబర్ 31 న ప్రారంభం కానుంది. నవంబర్ 1 వరకు IPO షేర్ల కోసం బిడ్లు వేయవచ్చు. రూ.500 కోట్ల ఈ ఇష్యూలో రూ.400 కోట్ల కొత్త షేర్లు జారీ కానుండగా, రూ.100 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. IPO BSE, NSEలలో లిస్టింగ్ చేయబడుతుంది.
DCX కంపెనీ ఎలక్ట్రానిక్ సబ్-సిస్టమ్స్, కేబుల్ హార్నెస్ తయారీలో భారతదేశపు ప్రముఖ తయారీదారులలో ఒకటి. కంపెనీ ప్రమోటర్లు NCBG హోల్డింగ్స్ Inc, VNG టెక్నాలజీ ఆఫర్ ఫర్ సేల్‌లో తమ వాటాను విక్రయిస్తాయి. IPOలో, ఈక్విటీలో 75 శాతం సంస్థాగత పెట్టుబడిదారుల రిజర్వ్‌లో ఉంచబడుతుంది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా రిజర్వ్ చేయబడింది.
ధర బ్యాండ్
ఈ ఐపీఓకు కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.197 నుంచి 207గా నిర్ణయించింది. IPOలో ఒక లాట్‌లో 72 షేర్లు ఉన్నాయి. ఇందులో చాలా కొనవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో కనీసం ఐపీఓలో కనీసం రూ.14,904 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. IPO ద్వారా వచ్చే ఆదాయం కంపెనీ రుణాన్ని చెల్లించడానికి , వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తారు. అదనంగా, ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం అనుబంధ సంస్థ రాణియల్ అడ్వాన్స్ సిస్టమ్స్‌లో పెట్టుబడి కోసం, మూలధన వ్యయ ఖర్చులు , సాధారణ కార్పొరేట్ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తామని కంపెనీ తన నోటీసులో తెలిపింది.
కంపెనీ వివరాలు
DCX సిస్టమ్స్ కంపెనీ ఎలక్ట్రానిక్ సబ్-సిస్టమ్‌లు , కేబుల్ హార్నెస్‌ల తయారీలో భారతదేశపు ప్రముఖ తయారీదారులలో ఒకటి. డిసెంబర్ 2021 నాటికి, కంపెనీకి ఇజ్రాయెల్, అమెరికా, కొరియా , భారతదేశం వంటి దేశాల్లో 26 మంది కస్టమర్‌లు ఉన్నారు. కంపెనీ కస్టమర్లలో కొందరు ఫార్చ్యూన్ 500 కంపెనీలను కూడా ఉంది. ఇది కాకుండా, అనేక బహుళజాతి కంపెనీలు, స్టార్టప్‌లు కంపెనీ కస్టమర్ జాబితాలో ఉన్నాయి..
2019-20లో కంపెనీ ఆదాయం రూ.449 కోట్లు. 2021-22లో ఇది 56.64 శాతం పెరిగి రూ.1102 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆర్డర్ బుక్ మార్చి 2020 నాటికి రూ. 1941 కోట్లుగా ఉంది, ఇది మార్చి 31, 2022 నాటికి రూ. 2369 కోట్లకు పెరిగింది. Edelweiss Financial Services, Axis Capital , Safron Capital IPO బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా ఉన్నాయి.