బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. నేడు 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే..?

By asianet news teluguFirst Published Oct 27, 2022, 10:13 AM IST
Highlights

ఒక నివేదిక ప్రకారం గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 10 గ్రాముల  24 క్యారెట్ రూ. 170 పెరిగి రూ.51,280 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి, 1 కిలో ధర  రూ.100 పెరిగి రూ.58,100 వద్ద ట్రేడవుతోంది. 

గత  కొద్ది రోజులుగా దీపావళి, ధంతెరస్, పెళ్లిళ్ల సీజన్ కూడా సమీపిస్తుండటం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి భారీగా కొనుగోలు చేస్తున్నారు. నిన్నటి వరకు తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరగడం  ప్రారంభించాయి. 

ఒక నివేదిక ప్రకారం గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 10 గ్రాముల  24 క్యారెట్ రూ. 170 పెరిగి రూ.51,280 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి, 1 కిలో ధర  రూ.100 పెరిగి రూ.58,100 వద్ద ట్రేడవుతోంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నేడు రూ.150 పెరిగి రూ.47,000 వద్ద ట్రేడవుతోంది.

ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.51,280గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.47,000 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో, 24 క్యారెట్ల ధర రూ. 51,430, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,150 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.51,980, 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ట్రేడవుతోంది.

బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత, 0116 GMT నాటికి స్పాట్ బంగారం 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $1,669.16కి చేరుకుంది. యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $1,673.30 వద్ద ఉన్నాయి.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులలో కిలో వెండి ధర రూ. 58,100. చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి రూ.64,500గా ఉంది.

 నేడు భారతీయ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
సిటీ         22-క్యారెట్    24-క్యారెట్ 
చెన్నై     రూ.47,650      రూ.51,980
ముంబై   రూ.47,000      రూ.51,280
ఢిల్లీ       రూ.47,150       రూ.51,430
కోల్‌కతా    రూ.47,000    రూ.51,280
బెంగళూరు    రూ.47,050    రూ.51,330
హైదరాబాద్  రూ.47,000    రూ.51280
నాసిక్    రూ.47,080    రూ.51,310
పూణే     రూ.47,080    రూ.51,310
వడోదర    రూ.47,080    రూ.51,310
అహ్మదాబాద్    రూ.47,050    రూ.51,330
లక్నో        రూ.47,150    రూ.51,430
చండీగఢ్    రూ.47,150    రూ.51,430
సూరత్       రూ.47,050    రూ.51,330
విశాఖపట్నం    రూ.47,000    రూ.51,280
భువనేశ్వర్  రూ.47,000    రూ.51,280
మైసూర్      రూ.47,050    రూ.51,330

click me!