ఐఆర్‌సీటీసీ ఆర్థిక ఫలితాల జోరు‌.. 80శాతం పెరిగిన నికరలాభం..

Ashok Kumar   | Asianet News
Published : Jul 13, 2020, 12:50 PM IST
ఐఆర్‌సీటీసీ ఆర్థిక ఫలితాల జోరు‌.. 80శాతం పెరిగిన నికరలాభం..

సారాంశం

డిసెంబర్ త్రైమాసికంలో ఐఆర్‌సిటిసి నికర లాభం 206 కోట్లు కాగా ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఐఆర్‌సిటిసి ఆదాయం దాదాపు మార్చిలో 18% పెరిగి 587 కోట్లకు చేరుకుంది. 

న్యూ ఢీల్లీ:  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి)  2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 79.3 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ నికర లాభం 150.6 కోట్లు కాగా, అంతకు ముందు ఏడాది 84 కోట్ల రూపాయలు అని చెప్పింది.

ఏదేమైనా వరుస లాక్ డౌన్ నిబంధనల కారణంగా కంపెనీ నికర లాభంలో 26.6% క్షీణించింది. మార్చి చివరి వారంలో కేంద్రం విధించిన కరోనా వైరస్ లాక్ డౌన్ ముఖ్యమైన కారణం కావచ్చు. డిసెంబర్ త్రైమాసికంలో ఐఆర్‌సిటిసి నికర లాభం 206 కోట్లు కాగా ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఐఆర్‌సిటిసి ఆదాయం దాదాపు మార్చిలో 18% పెరిగి 587 కోట్లకు చేరుకుంది. 

also read  డీమార్ట్‌ పై కరోనా వైరస్ ఎఫెక్ట్: భారీగా తగ్గిన లాభాలు ...

కంపెనీ ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెండ్ ప్రకటించింది. మార్చిలో లాక్ డౌన్ ప్రభావం ఐఆర్‌సిటిసి కార్యకలాపాలలోని దాదాపు ప్రతి విభాగంపై ప్రభావం చూపింది. క్యాటరింగ్ ఆదాయం 2020 మార్చిలో 12% తగ్గి 236 కోట్లకు చేరుకుంది,  అదే గతేడాది 2019 డిసెంబర్‌లో 269 కోట్లు.

వాటర్ బాటిల్ బ్రాండ్ రైల్ నీర్ సేల్స్ ద్వారా వచ్చిన ఆదాయం 13% క్షీణించి 51 కోట్ల రూపాయలు కాగా, కిందటి ఏడాది త్రైమాసికంలో 58.6 కోట్ల రూపాయలు. ఇంటర్నెట్ టికెటింగ్ ద్వారా ఐఆర్‌సిటిసి ఆదాయం 15 శాతం తగ్గి రూ.194 కోట్లకు చేరుకుంది అదే 2019 డిసెంబర్‌లో 7 పోలిస్తే 227 కోట్లు.

అయితే పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం 7% పెరిగి రూ. 102 కోట్లకు చేరుకుంది, 2019 డిసెంబర్‌లో 95 కోట్ల రూపాయలు. శుక్రవారం బిఎస్‌ఇలో ఐఆర్‌సిటిసి స్క్రిప్ 1% పెరిగి రూ.1,399 వద్ద ముగిసింది.

PREV
click me!

Recommended Stories

Pan Card : పాన్ కార్డ్ ఉంటే చాలు రూ.5 లక్షల లోన్ మీ సొంతం.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే !
Kia Car: పదమూడు లక్షలకే కియా లగ్జరీ కారు, సన్‌రూఫ్‌తో కూడా