కరోనా ఎఫెక్ట్‌తో 14 కోట్ల కొలువులు హాంఫట్.. త్వరిగతిన పరిష్కారానికి సూచనలు

By narsimha lodeFirst Published Jul 12, 2020, 1:11 PM IST
Highlights

 కరోనా వైరస్‌ ఉదృతితో 14.70 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని సిడ్నీ కేంద్రంగా పని చేస్తున్న 'ప్లోస్‌ వన్‌' అనే రీసెర్చ్‌ సంస్థ నివేదిక తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా 3.8ట్రిలియన్ల ఉత్పత్తిని కంపెనీ యాజమాన్యాలు నష్టపోయారని నివేదిక పేర్కొంది. 
 

ముంబై: కరోనా వైరస్‌ ఉదృతితో 14.70 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని సిడ్నీ కేంద్రంగా పని చేస్తున్న 'ప్లోస్‌ వన్‌' అనే రీసెర్చ్‌ సంస్థ నివేదిక తెలిపింది. అదేవిధంగా కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా 3.8ట్రిలియన్ల ఉత్పత్తిని కంపెనీ యాజమాన్యాలు నష్టపోయారని నివేదిక పేర్కొంది. 

తమ సర్వేలో తయారీ రంగం, పర్యాటక రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనకుడు అరుణిమా మాలికా తెలిపారు. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల 2.1ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఉద్యోగులు నష్టపోయినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది.

కరోనా వల్ల ప్రజలు రవాణాకు దూరంగా ఉండడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గినట్లు నివేదిక తెలిపింది. కరోనాను నివారించేందుకు ప్రభుత్వాలు పరష్కార మార్గాలను ఆలోచించాలని సర్వేలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొందని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు. 

ఇదిలా ఉంటే కరోనా రాకముందు కంటే ఇప్పుడు 48శాతం అధికంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారని క్విక్‌ జాబ్స్‌ అనే పోర్టల్‌ నివేదిక తెలిపింది. కాగా దరఖాస్తులలో, ఉద్యోగాల ఖాళీలలో భారీ వ్యత్యాసం ఉందని తెలిపింది. అయితే మెట్రో నగరాలలో ఉద్యోగాల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు పేర్కొంది.

also read:టిక్‌టాక్‌ ఔట్‌: స్వదేశీ పరిజ్ఞానానికి ప్రోత్సాహం.. రెడీ అవుతోన్న ‘పాప్‌‌-ఇన్‌’ యాప్‌

మరోవైపు ఐఏఎన్‌ఎస్‌ సర్వే ప్రకారం.. డాటా ఎంట్రీ, డెలివరీ ఎగ్జిక్యూటివ్స​, డ్రైవర్‌, టీచర్‌, మార్కెటింగ్‌, సేల్స్‌ తదితర విభాగాలలో అధిక దరఖాస్తులు వచ్చినట్టు నివేదిక తెలిపింది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని తెలిపింది.

విదేశాలలో ఉద్యోగాలు ఆశించేవారికి విమానయాన సంస్థ ఆంక్షలతో వారి ఆశలకు బ్రేక్‌ పడింది. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన వెంటనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

click me!