చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బూస్ట్: రూ. 1.20 లక్షల కోట్లు మంజూరు

By narsimha lodeFirst Published Jul 12, 2020, 11:40 AM IST
Highlights

ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన నగదు లభ్యత సమస్యలను దాని అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసిఎల్‌జిఎస్) కింద ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. 

న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన నగదు లభ్యత సమస్యలను దాని అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసిఎల్‌జిఎస్) కింద ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నెల 9వ తేదీ నాటికి, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 100 శాతం అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం కింద రూ .1.20 లక్షల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశాయి, 

ఈ రుణాల్లో ఇప్పటికే రూ. 62,000 కోట్లు బ్యాంకులు పంపిణీ చేశాయి. గత రెండు వారాల్లో బ్యాంకుల లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి, జూలై 9 వరకు గత ఐదు రోజుల్లో ఆంక్షలు రూ.5,500 కోట్లు పెరిగాయి, పంపిణీ సుమారు రూ. 6,000 కోట్లు పెరిగింది. 

‘2020 జూలై 9 నాటికి,  ప్రభుత్వరంగ, ప్రైవేట్ బ్యాంకులు 100 శాతం అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం కింద మంజూరు చేసిన మొత్తం రూ .1,20,099.37 కోట్లు, అందులో రూ .61,987.90 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయబడింది’ అని కేంద్ం తెలిపింది.

ఈసీఎల్‌జీఎస్ విజయానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులు దోహదపడ్డాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు మంజూరు చేసిన రుణ మొత్తాలు రూ .68,145.40 కోట్లకు పెరిగాయి.

అందులో ఈ నెల 9 నాటికి రూ.38,372.88 కోట్లు పంపిణీ చేయబడ్డాయి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు రూ . 51,953.97 కోట్లకు రుణాలు మంజూరు చేయగా, రూ.23,615.02 కోట్లకు పంపిణీ చేశాయి.

ఈ పథకం 30 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు మరియు ఇతర వ్యాపారాలు లాక్‌డౌన్‌ తర్వాత వారి వ్యాపారాలను పున: ప్రారంభానికి సాయపడుతుంది. ఆత్మనీర్భర్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్‌ఎంఈలు, చిన్న వ్యాపారాలకు అదనపు రుణంగా రూ .3 లక్షల కోట్ల ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి సంస్థలు తమ ప్రస్తుత రుణాల్లో 20 శాతం వరకు వడ్డీ రేట్ల వద్ద అదనపు రుణాలుగా పొందటానికి అర్హులు.

also read:టిక్‌టాక్‌ ఔట్‌: స్వదేశీ పరిజ్ఞానానికి ప్రోత్సాహం.. రెడీ అవుతోన్న ‘పాప్‌‌-ఇన్‌’ యాప్‌

ఆర్మీ నిషేధానికి గురికావడం విచారకరం: ట్రూకాలర్
సైనికులు ట్రూకాలర్ యాప్ వినియెగించరాదంటూ ఆర్మీ జారీ చేసిన ఆదేశాలు విచారకరమైన ట్రూకాలర్ వ్యాఖ్యానించింది. ట్రూకాలర్ స్వీడన్‌కు చెందిన సంస్థ అయినా  కూడా భారత్‌ను తన స్వస్థలంగా భావిస్తుందని సంస్థ ప్రతినిధి తెలిపారు. 

‘భారత సాయుధ బలగాలు అంటే మాకు ఎంతో గౌరవం. ఆర్మీకి భారత ప్రభుత్వానికి ఈ సమయంలో మేం సంఘీభావం ప్రకటిస్తున్నాం. ట్రూకాలర్ వినియోగంతో ఆర్మీకి, పౌరులకు ఎటువంటి ప్రమాదం లేదని మేము పునరుద్ఘాటిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. 

ఆర్మీ వారు వినియోగించ రాదని ప్రకటించిన 89 యాప్‌ల జాబితాలో ట్రూకాలర్‌ను చేర్చడానికి కారణమేంటో తమకు అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వెనుకున్న కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని, దీనిపై లోతైన సమీక్ష జరుపుతామని సంస్థ ప్రతినిధి తెలిపారు. 
 

click me!