ఐపీవోల సందడి.. పబ్లిక్‌ ఇష్యూకు Syrma SGS Tech... వివ‌రాలు ఇవిగో..

By Mahesh RajamoniFirst Published Aug 12, 2022, 1:46 PM IST
Highlights

Syrma SGS Tech: ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ సర్వీస్ కంపెనీ అయిన సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూ నేడు(12న) ప్రారంభం కానుంది. ఐపీవో ద్వారా సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ రూ. 840 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
 

IPO market: దాదాపు రెండున్నర నెలల తర్వాత, IPO మార్కెట్లో మ‌ళ్లీ సంద‌డి మొద‌లుకానుంది. నేటి నుంచి ఓ ప్ర‌ముఖ కంపెనీ ఐపీవోకు త‌లుపులు తెరిచింది. అదే సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ (Syrma SGS Tech). ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ సర్వీసుల  ఈ విభాగంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూ శుక్ర‌వారం నాడు ప్రారంభం అయింది. ఐపీవో ద్వారా సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ రూ. 840 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇది పెట్టుబ‌డులు పెట్టేవారికి మంచి అవ‌కాశం అయిన‌ప్ప‌టికీ.. నిపుణుల సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకోవాల‌ని మార్కెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే..  ప్రైమరీ మార్కెట్‌లో మ‌ళ్లీ శుక్ర‌వారం నుంచి సంద‌డి మొద‌లైంది. ఐపీవో మార్కెట్లో మరోసారి యాక్షన్ స్టార్ట్ కానుంది. దాదాపు రెండున్నర నెలల తర్వాత ప‌లు కంపెనీలు ఐపీవోకు వ‌స్తున్నాయి. ఈరోజు (12 ఆగ‌స్టు)  సిర్మా SGS టెక్నాలజీ ప‌బ్లిక్ ఇష్యూ రానుంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యాపారంలో ఉంది. దాని దృష్టి ఖచ్చితమైన తయారీపై కొన‌సాగుతోంది. అంతకుముందు మే 26న ఏథర్ ఇండస్ట్రీస్ IPO వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మరే ఇతర కంపెనీ కూడా ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించలేదు. అయితే, రాబోయే కాలంలో చాలా కంపెనీలు తమ IPOను తీసుకురావచ్చు. ఎందుకంటే ఇప్ప‌టికే దాదాపు 28 పంపెనీల‌ వ‌ర‌కు ప‌బ్లిక్ ఇష్యూని తీసుకురావడానికి సెబీ ఆమోదం తెలిపింది. 

సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్ (Syrma SGS Tech IPO ).. 

సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్ (Syrma SGS Tech IPO ) ఐపీవో శుక్ర‌వారం నాడు షురు అయింది. ఐపీవో అప్లికేష‌న్స్ ఏడు రోజుల వ‌ర‌కు తెరిచివుండ‌నున్నాయి. కంపెనీ తన IPO కోసం ఈక్విటీ షేరుకు రూ. 209-220 ధరను నిర్ణయించింది. సిర్మా SGS టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూలో రూ.766 కోట్ల విలువైన తాజా షేర్లు, వీణా కుమారి టాండన్ ద్వారా 33.69 లక్షల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. ధరల శ్రేణి ఎగువ ముగింపులో కంపెనీ రూ. 840 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మినిమ‌వ్ షేర్ల క్వాంటిటీ 68 గా ఉండ‌గా, మినిమ‌మ్ ఇన్వెస్ట్ మెంట్ రూ.14212గా ఉంది. ఇన్వెస్టర్లు ఈ ఇష్యూపై ఆగస్టు 18 వరకు వేలం వేయవచ్చు. ప‌బ్లిక్ ఇష్యూ ద‌ర్వా వ‌చ్చే నిధులను పెట్టుబడి వ్యయాలు, ఆర్‌అండ్‌డీ విస్తరణ, కార్పొరేట్‌ అవసరాలకు ఉప‌యోగించ‌నున్నార‌ని స‌మాచారం. Syrma SGS Tech కంపెనీ కస్టమర్లలో ఏవో స్మిత్, టీవీఎస్‌ మోటార్, యురేకా ఫోర్బ్స్‌ తదితరాలున్నాయి. మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ప్రస్తుతం ఇష్యూ గ్రే మార్కెట్‌లో లాభాలను చూపుతోంది. అయితే, గ్రే మార్కెట్‌లో చాలా పదునైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. కాబట్టి కంపెనీ పనితీరుపై పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది.

నిపుణుల ఏమంటున్నారంటే..  ఏమిటి ?

ET నివేదిక ప్రకారం.. ఈ ఈ ఐపీవోపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిపుణులు అందించే సూచ‌న‌లు మిశ్ర‌మంగా ఉన్నాయి. ఛాయిస్ బ్రోకింగ్ ప్రకారం, ఇష్యూలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు కానీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీడియం నుండి దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడి సలహాను ఇచ్చింది. అయితే, ఇష్యూలో లిస్టింగ్ లాభాలను దృష్టిలో ఉంచుకుని పెట్లుబ‌డులు పెట్ట‌డం మంచిద‌ని Asit C Mehta Investments సలహా ఇచ్చింది. కంపెనీకి ప్రస్తుతం 200 కంటే ఎక్కువ మంది క్లయింట్లను క‌లిగి ఉంది. వీరిలో 16 మంది క్లయింట్లు గత 10 సంవత్సరాలుగా కంపెనీతో అనుబంధం కలిగి ఉన్నారు. టీవీఎస్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, బాష్ ఇంజినీరింగ్ వంటి పెద్ద క్లయింట్లు ఉన్నాయి.

click me!