రెండు నెలలుగా స్థిరంగా ఇంధన ధరలు.. ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత పెట్రోల్-డీజిల్ ఎంత తగ్గిందంటే ?

By asianet news teluguFirst Published Aug 12, 2022, 11:20 AM IST
Highlights

జూలైలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. ముడిచమురు, డీజిల్‌-పెట్రోల్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంధనం (ఏటీఎఫ్‌)పై విధించే కొత్త పన్నును ప్రభుత్వం ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తుందని చెప్పారు.

 ప్రభుత్వ చమురు కంపెనీలు శుక్రవారం ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే చమురు ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ నుంచి చెన్నై వరకు పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కి విక్రయిస్తుండగా, డీజిల్ రూ.89.62కి లభిస్తోంది. కొత్త ధరల ప్రకారం, మహారాష్ట్ర మినహా,రాజస్థాన్, గుజరాత్,బీహార్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో వరుసగా 83వ రోజు  ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

జూలైలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. ముడిచమురు, డీజిల్‌-పెట్రోల్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంధనం (ఏటీఎఫ్‌)పై విధించే కొత్త పన్నును ప్రభుత్వం ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తుందని చెప్పారు. ముడిచమురు ధర పతనం, ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత దేశీయ మార్కెట్‌లో చమురు ధర తగ్గుతుందని అంతా భావించారు. అయితే గత రెండున్నర నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

దేశవ్యాప్తంగా పెట్రోలు-డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో నేడు పెట్రోలు రూ.106.31కి విక్రయిస్తుండగా, డీజిల్ లీటరుకు రూ.94.27 చొప్పున విక్రయిస్తున్నారు. చెన్నై గురించి చెప్పాలంటే ఇక్కడ పెట్రోల్ రూ.102.63కు, డీజిల్ రూ.94.24కు లభిస్తోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03గా, డీజిల్ రూ.92.76గా ఉంది. 

పెట్రోల్-డీజిల్ ధరలు  
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.

రాష్ట్ర స్థాయిలో పెట్రోల్‌పై విధించే పన్ను కారణంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. మీరు మీ ఫోన్ నుండి SMS ద్వారా ప్రతిరోజూ  పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. దీని కోసం ఇండియన్ ఆయిల్ (IOCL) వినియోగదారులు RSP కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. 

ముడి చమురు ధరలు ఇప్పటికీ బ్యారెల్‌కు $100 కంటే తక్కువగా ఉంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 96.88 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ బ్యారెల్‌కు 99.35 డాలర్లుగా ఉంది.


- పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ రూ. 84.10, డీజిల్ రూ. 79.74
- ఢిల్లీ పెట్రోల్ రూ. 96.72, డీజిల్ రూ. 89.62
- ముంబై పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28 
- కోల్‌కతా పెట్రోల్‌ రూ. 106.03, డీజిల్‌ రూ. 92.76
- నోయిడాలో రూ. 96.57, డీజిల్‌ రూ. 89.96
- లక్నోలో పెట్రోల్‌ రూ. 96.57, డీజిల్‌ రూ . 89.706
- పాట్నాలో పెట్రోల్ రూ. 107.24 మరియు డీజిల్ రూ. 94.04
గురుగ్రామ్‌లో లీటర్‌కు రూ.97.18, డీజిల్‌ రూ.90.05  
బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.94, డీజిల్‌ రూ.87.89
భువనేశ్వర్‌లో రూ.103.19, డీజిల్‌ రూ.94.76-
 హైదరాబాద్‌లో పెట్రోల్  లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82

click me!