300 విమానాలను ఆర్డర్ చేసిన ఇండిగో...

By Sandra Ashok Kumar  |  First Published Oct 30, 2019, 11:48 AM IST

ఎయిర్‌బ్‌సకు  ఇండిగో సంస్థ 300 "ఎ 320 నియో" విమానాలకు ఆర్డర్‌ చేసింది.  ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్ చేయటం ఇదే మొదటిసారి ఆ కంపెనీ పేర్కొంది. ఎ 320 నియో విమానాలకు ప్రపంచంలోనే అతి పెద్ద కస్టమర్‌ ఇండిగో" అని ఎయిర్‌బస్‌ సీఈఓ గిలోమీ ఫారీ అన్నారు.


ముంబై : విమానయాన రంగ సంస్థ ఇండిగో తాజాగా ’ఎయిర్‌బస్‌ 320 నియో’ రకానికి చెందిన 300 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ఆర్డర్‌ చేసిన వాటిలో ఎ 320నియో, ఎ 321 నియో, ఎ 321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానాలున్నాయని కంపెనీ తెలిపింది. 

అయితే ఈ ఆర్డర్‌ విలువ ఎంత అన్నది వెల్లడించనప్పటికీ 2018లో ప్రచురించిన ధర ప్రకారం ఈ ఆర్డరు విలువ సుమారు 33 బిలియన్‌ డాలర్లుగా (ఒక్కో విమానానికి  దాదాపు రూ. 2.3 లక్షల కోట్లు) ఉండొచ్చని అంచనా. ఈ కొత్త ఆర్డర్‌తో ఇండిగో చేతిలో ఎ 320 కుటుంబానికి చెందిన విమానాల సంఖ్య 730కి చేరుతుంది.

Latest Videos

also read మనోళ్లు మంచి పనిమంతులు: బెస్ట్ సీఈఓల్లో ముగ్గురు ఎన్నారైలకు చోటు 

ఇండిగో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రోనోజోయ్‌ దత్తా మాట్లాడుతూ " ఇండిగో 2005-2015 సంవత్సరాల మధ్య కాలంలోనే 530 ఎయిర్‌బ్‌సలకు పలు విడతలుగా ఆర్డర్లు జారీ చేసింది. కాగా ఈ ఆర్డర్‌ ఇండిగోకు ఒక కొత్త మైలురాయి అని, భారత విమానయాన రంగం సాధించనున్న బలమైన వృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆ డిమాండును తట్టుకునేందుకు ఇంత భారీ ఆర్డర్‌ జారీ చేశామని" అన్నారు. 

"ఎయిర్‌బ్‌సకు ఒక విమానయాన సంస్థ ఇంత భారీ ఆర్డర్‌ ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి కంపెనీ పేర్కొంది. ఎ 320 నియో విమానాలకు ప్రపంచంలోనే అతి పెద్ద కస్టమర్‌ ఇండిగో" అని ఎయిర్‌బస్‌ సీఈఓ గిలోమీ ఫారీ అన్నారు.

also read యూపీఐ ట్రాన్సాక్షన్స్ @ రూ.100 కోట్లు.. మూడేళ్లలోనే రికార్డు

3 వేల గంటలకు పైగా తిరిగిన 13 ఎ 320 నియో విమానాలకు అమర్చిన ప్రాట్‌ అండ్‌ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజన్లు వచ్చే 15 రోజుల్లోగా మార్చాలని గో ఎయిర్‌ విమానయాన సంస్థను డీజీసిఏ ఆదేశించారు. ఆ విమానాలన్నింటికీ ఆధునీకరించిన కొత్త పీడబ్ల్యూ ఇంజన్లు అమర్చాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు ఒక అధికారి  తెలిపారు.

click me!