Stock Market Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సూచీలకు జోష్ నింపిన ఎన్నికల ఫలితాలు..

Published : Mar 10, 2022, 04:44 PM IST
Stock Market Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సూచీలకు జోష్ నింపిన ఎన్నికల ఫలితాలు..

సారాంశం

Stock Market Closing Bell:  మార్కెట్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జోష్ నింపాయి. అలాగే రష్యా, ఉక్రెయిన్ చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చే మార్గం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గురువారం పాజిటివ్ గా ముగిశాయి. సెన్సెక్స్ 817.06 పాయింట్ల లాభంతో ముగిసింది. 

యూపీ ఎలక్షన్లతో పాటు, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు సైతం చల్లబడే అవకాశం కనిపించడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచే మార్కెట్లు ఎన్నికల ఫలితాలు వెలువడటం ప్రారంభంతోనే పాజిటివ్ గా స్పందించాయి. సెన్సెక్స్ ఏకంగా ఇంట్రాడేలో 1600 పాయింట్లు లాభపడింది. 

చివరకు వరుసగా మూడో సెషన్‌లో కూడా బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ముగియడంతో సెక్టార్లలో కొనుగోళ్లకు దోహదపడింది. ముగింపులో సెన్సెక్స్ 817.06 పాయింట్లు. 1.50% పెరిగి 55,464.39 వద్ద  క్లోజవగా, నిఫ్టీ 249.50 పాయింట్లు, 1.53% పెరిగి 16,594.90 వద్ద క్లోజయింది. దాదాపు 2346 షేర్లు పురోగమించగా, 937 షేర్లు క్షీణించాయి, 94 షేర్లు మారలేదు. 

హెచ్‌యూఎల్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ టాప్ నిఫ్టీ లాభపడిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ, టీసీఎస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. 

ఆటో, మెటల్, ఎఫ్‌ఎంసిజి, పవర్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు బ్యాంక్, రియాల్టీ సూచీలు 1-2 శాతం ఎగబాకడంతో అన్ని సెక్టోరల్ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.

రష్యా , ఉక్రెయిన్ మధ్య ఉన్నత స్థాయి చర్చల్లో పురోగతి, ఆసియా మార్కెట్‌లో పెరుగుదల ఆశలు, భారతీయ మార్కెట్ బలమైన గ్యాప్-అప్‌తో ప్రారంభమైంది. సానుకూల రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండటం వల్ల మెరుగైన పనితీరుకు మద్దతు లభించింది. అయినప్పటికీ, బలహీనమైన పశ్చిమ మార్కెట్, ముడి చమురు ధరల పెరుగుదల కొద్ది అస్థిరతను జోడించింది. దీంతో మార్కెట్లు ఇంట్రాడే హై నుంచి పతనం అయ్యాయని వినోద్ నాయర్, Head of Research, Geojit Financial Services పేర్కొన్నారు. 

Mohit Nigam, Head - PMS, Hem Securities మాట్లాడుతూ. రష్యా-ఉక్రెయిన్ చర్చల నుండి అనుకూలమైన ఫలితం వస్తుందని మార్కెట్ పాజిటివ్ గా స్పందిస్తోందని తెలిపార. అయితే రష్యా చమురుపై US ఆంక్షల కారణంగా సరఫరా కొరతను ఎదుర్కొంటున్న క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లలో మరింత చమురు ఉత్పత్తిని పెంచేందుకు మద్దతు ఇస్తున్నట్లు OPEC సభ్య దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ముందుకు వచ్చింది. ఇది కూడా ప్రోత్సాహకరమైన పరిణామమే.  ఒపెక్  దేశాలు ఉత్పత్తిని పెంచడానికి అంగీకరిస్తే, తదుపరి సెషన్‌లో ముడి చమురు ధరలు స్థిరంగా ఉండవచ్చు. 

ఇక 5 రాష్ట్రాల ఎన్నికలలో బిజెపి బలమైన ప్రదర్శన బుల్లిష్ మూడ్‌ను మరింత ప్రోత్సహించింది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జియో పొలిటికల్ పరిస్థితుల్లో ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. అయితే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం షేర్లను కొనుగోలు చేయడంపై మాత్రం ఫోకస్ పెట్టవచ్చు.  పరిగణించవచ్చు.

టెక్నికల్ ఫ్రంట్‌లో, నిఫ్టీలో తక్షణ మద్దతు, నిరోధం 16,200 మరియు 16,800 వద్ద ఉండగా, బ్యాంక్ నిఫ్టీకి, తక్షణ మద్దతు మరియు నిరోధం 33,500 మరియు 35,500 వద్ద ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు