Gold Imports: భారీగా బంగారం కొనుగోలు.. ఆ దేశం నుంచే అధిక దిగుమ‌తులు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 11, 2022, 04:27 PM ISTUpdated : Mar 11, 2022, 04:28 PM IST
Gold Imports: భారీగా బంగారం కొనుగోలు.. ఆ దేశం నుంచే అధిక దిగుమ‌తులు..!

సారాంశం

దేశంలోకి బంగారం దిగుమతులు వార్షిక ప్రాతిపకదిన చూస్తే భారీగా పెరిగాయి. 2021లో బంగారం దిగుమతుల 1000 టన్నులకు పైగా నమోదు అయ్యాయి.

క‌రోనా వచ్చిన తర్వాత బంగారం అమ్మకాలు భారీగా పడిపోయాయి. దిగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. అయితే గత ఏడాది క‌రోనా ఉన్నా కూడా బంగారం దిగుమతులు పుంజుకున్నాయి. 2021లో పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. 1067.72 టన్నులుగా నమోదు అయ్యాయి. 2020లో బంగారం దిగుమతులు 430.11 టన్నులు కావడం గమనార్హం. జెమ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) ఈ గణాంకాలను వెల్లడించింది.

భారత్ బంగారం దిగుమతులు 2021 క్యాలెండర్ ఏడాదిలో భారీగా పెరిగాయి. కరోనా కారణంగా 2020లో 430.11 టన్నులకు పడిపోయిన దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ మేరకు జెమ్స్ జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) గురువారం తెలిపింది. కరోనా ముందు 2019 క్యాలెండర్ ఏడాదితో పోల్చినా పసిడి దిగుమతులు 836.38 టన్నుల నుండి 27.66 శాతం పెరిగి, 1067.72 టన్నులకు చేరుకున్నాయి.

మన దేశం 2021లో ఏ ఏ దేశాల నుంచి బంగారాన్ని ఎక్కువగా దిగమతి చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యధికంగా స్విట్జర్లాండ్ నుండి 469.66 టన్నుల దిగుమతులు నమోదయ్యాయి. ఆ తర్వాత యూఏఈ నుండి 120.16 టన్నులు, సౌత్ ఆఫ్రికా నుండి 71.68 టన్నులు, గినియా నుండి 58.72 టన్నులు ఉన్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక పసిడి దిగుమతులు చేసుకునే దేశం భారత్. 2015లో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 1047 టన్నులు, 2017లో 1032 టన్నులుగా నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య నెలవారీ సగటు పసిడి దిగుమతులు 76.57 టన్నులుగా నమోదయ్యాయి.

క‌రోనా తర్వాత ఇప్పుడు మళ్లీ బంగారం దిగమతులు సాధారణ స్థాయికి వచ్చాయని చెప్పుకోవచ్చు. పసిడి దిగుమతులు 2015లో 1047 టన్నులుగా, 2017లో 1032 టన్నులుగా ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగమతులు ప్రతి నెలా సగటున 76.57 టన్నులుగా ఉన్నాయి. 2018-19, 2019-20లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఇకపోతే హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1750 పడిపోయింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,580కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.1600 తగ్గుదలతో రూ. 48,200కు క్షీణించింది. బంగారం ధరలు పడిపోతే.. వెండి రేటు కూడా భారీగా తగ్గింది. ఏకంగా రూ.2,600 పతనమైంది. దీంతో వెండి ధ‌ర‌ రూ. 74,100కు దిగి వచ్చింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియా.. కాస్త తెలివిగా ఆలోచిస్తే నెల‌కు రూ. ల‌క్ష ప‌క్కా
Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు