పిఎస్‌ఎల్‌వి-సి 47 కార్టోసాట్ -3, 13 వాణిజ్య నానోసాటిలైట్‌లను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిఎస్‌సి) షార్ నుండి సన్ సింక్రోనస్ కక్ష్యలోకి బుధవారం ఉదయం ప్రవేశపెట్టబోతున్నారు.
భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పోలార్ శాటిలైట్ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. పిఎస్‌ఎల్‌వి-సి 47 కార్టోసాట్ -3, 13 వాణిజ్య నానోసాటిలైట్‌లను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిఎస్‌సి) షార్ నుండి సన్ సింక్రోనస్ కక్ష్యలోకి బుధవారం ఉదయం ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ ప్రయోగం వాతావరణ పరిస్థితులకు బట్టి నవంబర్ 27, 2019 న ఉదయం 9:28 గంటలకు IST వద్ద ఆకాశంలోకి పంపడానికి సెట్ చేశారు.పిఎస్‌ఎల్‌వి-సి 47 అనేది పిఎస్‌ఎల్‌వి 'ఎక్స్‌ఎల్' కాన్ఫిగరేషన్‌లో ఇది 21 రాకెట్. ఇందులో 6 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్లను కలిగి ఉంటుంది.
also read ఆర్-కామ్ ఆస్తుల కోసం జియో, ఎయిర్‌టెల్ పోటీ
శ్రీహరికోటలోని ఎస్‌డిఎస్‌సి షార్ నుండి ఇది 74 వ ప్రయోగ వాహన మిషన్.ఈ రాకెట్ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. కార్టోసాట్ -3 ఉపగ్రహం 3వ జనరేషన్ సంబంధించిన అధునాతన ఉపగ్రహం. ఇది అధిక ఇమేజింగ్ రిజల్యూషన్ ( ఎక్కువ స్పష్టమయిన చిత్రాలు ) సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఈ ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వద్ద 509 కిలోమీటర్ల పైన కక్ష్యలో ఉంచనున్నారు.ఇందులో 12 ఫ్లోక్-4పీ అనే చిన్న ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో చిన్న ఉపగ్రహం కూడా ఉంది.న్యూస్‌పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) అంతరిక్ష శాఖతో వాణిజ్య ఏర్పాట్లలో భాగంగా పిఎస్‌ఎల్‌వి-సి 47 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన 13 వాణిజ్య నానోసాటిలైట్‌లను తీసుకువెళుతుంది.
also read స్టాక్ మార్కెట్లలో లాభాల వరద...రికార్డు స్థాయిలో న్యూ హైట్స్‌కు స్టాక్స్...
పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.