FedEx CEO Raj Subramaniam: ఫెడెక్స్ ఫ్యూచర్ సీఈవో సుబ్రమణియం గురించి తెలుసా..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 29, 2022, 03:28 PM ISTUpdated : Mar 29, 2022, 03:34 PM IST
FedEx CEO Raj Subramaniam: ఫెడెక్స్ ఫ్యూచర్ సీఈవో సుబ్రమణియం గురించి తెలుసా..?

సారాంశం

అంతర్జాతీయ  దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రముఖ కొరియర్ డెలివరీ సంస్థ FedExకు భారతీయ అమెరికన్ అయిన రాజ్ సుబ్రమణియంను సీఈఓగా నియమిస్తున్నట్టు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.

అమెరికాలోని ప్రముఖ సంస్థలను ఇండియన్లు ఏలుతున్నారు. ఉద్యోగ వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ భారతీయ ముద్ర వేస్తున్నారు.  మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ సీఈవో వరకు మన పెత్తనమే నడుస్తోంది.  తాజాగా మరో ప్రవాస భారతీయుడు అమెరికాలోని ప్రముఖ కంపెనీకి సీఈవ గా నియామకమయ్యారు. అమెరియా మల్టీ నేషనల్ కంపెనీ ఫెడెక్స్ కు రాజ్ సుబ్రమణియం సీఈవో బాధ్యతలు చేపట్టనున్నట్లు మల్టీ నేషనల్ కొరియర్ సర్వీస్ మేజర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న‌ ఫెడెక్స్ ఫౌండర్ సీఈవో ఫ్రెడెరిక్ డబ్లు స్మిత్ వచ్చే జూన్‌లో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

భారత్ కు చెందిన రాజ్ సుబ్రమణియం 1991లో ఈ కంపెనీలో చేరారు. ఆసియా అమెరికాలోని పలు మార్కెటింగ్ మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వర్తించారు. తన ప్రతిభా పాటవాలతో అతికొద్ది కాలంలోనే చీఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అధికారి స్థాయికి ఎదిగారు. ఈ హోదాలో ఆయన కార్పొరేట్ స్ట్రాటజీ డెవలప్మెంట్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్ ఫోర్టు కంపెనీ అయిన ఫెడెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లో చేరారు. 56 ఏళ్ల సుబ్రమణియంకు  36 ఏళ్ల అనుభవం ఉంది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సుబ్రమణియం ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం న్యూయార్క్ లోని సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పుచ్చుకున్నారు. 

ప్రస్తుతం ఉన్న సీఈవో, చైర్మన్ ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్ ఫెడెక్స్ కంపెనీని 1971లో ప్రారంభించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ హోదాలు మారారు. తన సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. కొద్దికాలం కిందట అమెరికాలో చేసిన సర్వే ప్రకారం కంపెనీల్లో పనిచేయడానికి 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. అందులో 78 శాతం మంది ఫెడెక్స్ పట్ల ఆసక్తి చూపినట్లు తెలింది.

టెనస్సీలో ఫెడెక్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో చేరిన సుబ్రమణియం తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటూ సీఈవోగా ఎదిగారు. ముందుగా ఆయన కార్ప్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కంపెనీకి ఎగ్జిక్యూటివ్ గా నియామకమ్యారు. ఆ తరువాత వైస్ ప్రెసిడెంట్ చీఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. కెనడాలోని ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ అధ్యక్షుడిగా 1991లో చేరినప్పటి నుంచి ఆసియా అమెరికా అంతటా వివిధ విభాగాల్లో పనిచేశారు.

PREV
click me!

Recommended Stories

Personal Loan: పర్సనల్ లోన్ త్వరగా తీరిపోవాలంటే ఇలా చేయండి
Banking: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.? ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే