
ఈరోజు స్టాక్ మార్కెట్ లో లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ప్రీ ఓపెనింగ్ లోనే సెన్సెక్స్, నిఫ్టీలు మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లలో కూడా మంచి జంప్ కనిపించడంతో దాని ప్రభావం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ పైనా కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నాయి.
నేటి ట్రేడింగ్‌లో, BSE సెన్సెక్స్ 221.27 పాయింట్లు లాభపడి 57,814 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 75.20 పాయింట్లు లాభపడి 17,297 వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 57900 స్థాయిని దాటినా.. ఆ తర్వాత మళ్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించి 57900 దిగువకు వెళ్లింది. అదే సమయంలో, నిఫ్టీ ప్రారంభంలోనే 17300 స్థాయిని దాటింది. ప్రస్తుతం 11 గంటలకు సెన్సెక్స్ 57,790.87 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
సెక్టోరల్ ఇండెక్స్ పరిస్థితి ఏంటి..?
నేడు మెటల్, మీడియా, చమురు, గ్యాస్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు బుల్లిష్ ట్రెండ్‌తో గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగం దాదాపు 1 శాతం మరియు రియల్టీ స్టాక్స్ 0.88 శాతం పెరుగుదలను చూస్తున్నాయి. ఆటో రంగంలో 0.70 శాతం వృద్ధి, ఆర్థిక సేవల రంగం 0.66 శాతం లాభంతో ట్రేడవుతోంది.
నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీ స్టాక్‌లలో 37 గ్రీన్‌మార్క్‌తో, 13 స్టాక్‌లు పతనంతో ట్రేడవుతున్నాయి. పెరుగుతున్న స్టాక్స్‌లో ఎస్‌బీఐ 2.15 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.71 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి 1.67 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.45 శాతం, గ్రాసిమ్ 1.40 శాతం చొప్పున ట్రేడింగ్‌ను నమోదు చేశాయి.
నేటి టాప్ లూజర్స్
కోల్ ఇండియా 2.35 శాతం, ఓఎన్‌జీసీ 1.90 శాతం పతనంతో కనిపిస్తున్నాయి. ఐషర్ మోటార్స్ 0.74 శాతం క్షీణతను నమోదు చేస్తోంది. ఐటీసీ 0.70 శాతం, హిందాల్కో 0.41 శాతం బలహీనతతో ట్రేడవుతున్నాయి.
క్రూడ్ రేటు ప్రభావం
గ్లోబల్ మార్కెట్‌లో గత 24 గంటల్లోనే ముడి చమురు ధరలు 9 శాతం తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లపై సానుకూలంగా చూపబడింది. అటు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా బలపడింది.
ఆసియా మార్కెట్లు కూడా పుంజుకున్నాయి
మంగళవారం ఉదయం ఆసియాలోని చాలా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 0.62 శాతం జంప్ కనిపించగా, జపాన్‌కు చెందిన నిక్కీ 0.96 శాతం వద్ద ట్రేడవుతోంది. ఇది కాకుండా హాంకాంగ్‌లో 0.40 శాతం, తైవాన్‌లో 0.23 శాతం పెరిగింది. దక్షిణ కొరియా కాస్పీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.49 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 0.05 శాతం పెరిగింది.