
ముంబై: ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ హురాన్ ఇండియా తాజాగా 'సెల్ఫ్ ఎంపవర్డ్ రిచ్ లిస్ట్ 2020'ను విడుదల చేసింది. సొంత స్టార్టప్‌లను ఏర్పాటు చేసి రూ.1,000 కోట్లకు పైగా సంపాదించిన 40 ఏళ్లలోపూ ఉన్న 16 మంది ప్రముఖ వ్యక్తులలో 50% మంది బెంగళూరుకు చెందినవారే అని తెలిపింది.
స్టార్టప్‌లకు బెంగళూరు నెం 1:
లావాదేవీలను సులభతరం చేయడానికి జెరోధా అనే స్టాక్ కంపెనీని స్థాపించి స్వయం ఉపాధి వ్యవస్థాపకుల జాబితాలో నితిన్ కామత్ (40), నిఖిల్ కామత్ (34) మొదటి స్థానంలో ఉన్నారు. వీరిద్దరి సంపద మొత్తం రూ.24 వేల కోట్లు.
దుబాయ్‌కు చెందిన దివాంక్ తురాఖియా మీడియా.నెట్‌ను స్థాపించిన 14వేల కోట్ల రూపాయలతో రెండో స్థానంలో నిలిచింది. ఉడాన్ వ్యవస్థాపకులు అమోద్ మాల్వియా, సుజీత్ కుమార్ అలాగే న్యూ ఢీల్లీలోని వైభవ్ కుమార్ ఉడాన్ కంపెనీలో మూడవ అతిపెద్ద వాటాదారులు.
also read సామాన్యుల అవసరాలను ఈ ఫౌండేషన్ నా కళ్ళు తెరిపించాయి: సుధా మూర్తి ...
ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.13,100 కోట్ల సంపద కలిగి ఉన్నారు. ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న బెంగళూరుకు చెందిన బైజూస్ సంస్థ వ్యవస్థాపకులు రిజు రవీంద్రన్ 78వేల కోట్ల రూపాయల సంపదతో 6వ స్థానంలో ఉన్నారు.
బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్ కంపెనీని స్థాపించిన బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ సంపద రూ.7500 కోట్లు. వీరు 7వ స్థానంలో ఉన్నారు. ఢీల్లీకి చెందిన ఓరవెల్ స్టేసే కంపెనీకి చెందిన రితేష్ అగర్వాల్ రూ.4500 కోట్లతో 9వ స్థానంలో ఉండగా బెంగళూరులో ఓలా క్యాబ్స్‌ను స్థాపించి నాయకత్వం వహించిన భవీష్ అగర్వాల్ మొత్తం రూ.3500 కోట్ల ఆదాయంతో 10వ స్థానాన్ని దక్కించుకున్నారు. అదనంగా, అదే కంపెనీకి చెందిన అంకిత్ భాటి రూ.1600 కోట్లతో 14వ స్థానంలో ఉన్నారు.