ఆవు పేడతో తయారు చేసిన చిప్ తో రేడియేషన్‌కు చెక్: వల్లభాయ్ కాతిరియా

By Sandra Ashok KumarFirst Published Oct 13, 2020, 1:05 PM IST
Highlights

ఆవు పేడ ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ''కామధేను దీపావళి అభియాన్'' ప్రచారం ప్రారంభించిన వల్లాభాయ్ కతిరియా మాట్లాడుతూ: "ఆవు పేడ అందరినీ రక్షిస్తుంది, ఇది ఫోన్ నుండి వెలువడే రేడియేషన్‌ను తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

న్యూ ఢీల్లీ: రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (ఆర్‌కెఎ) చైర్మన్ వల్లభాయ్ కాతిరియా ఆవు పేడతో తయారు చేసిన 'చిప్'ను ఆవిష్కరించారు. ఈ చీప్ మొబైల్ హ్యాండ్‌సెట్ల నుండి వచ్చే రేడియేషన్‌ను తగ్గిస్తుందని,  వ్యాధుల నుండి రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు.

ఆవు పేడ ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ''కామధేను దీపావళి అభియాన్'' ప్రచారం ప్రారంభించిన వల్లాభాయ్ కతిరియా మాట్లాడుతూ: "ఆవు పేడ అందరినీ రక్షిస్తుంది, ఇది ఫోన్ నుండి వెలువడే రేడియేషన్‌ను తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

ఈ రేడియేషన్ చిప్ ఫోన్ రేడియేషన్ తగ్గించడానికి మొబైల్ ఫోన్లలో ఉపయోగించబడుతుంది. మరో గొప్ప విషయం ఏంటంటే ఈ చీప్ వ్యాధుల నుండి రక్షింస్తుంది."

రేడియేషన్ తగ్గించడానికి ఆవు పేడతో ఆవు పేడతో తయారు చేసిన 'చిప్'ను సోమవారం ఆవిష్కరించారు. ఈ చిప్ మొబైల్ హ్యాండ్‌సెట్ల నుండి వెలువడే రేడియేషన్‌ను తీవ్రంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.

also read 

ఆవు పేడతో తయారైన ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'కామధేను దీపావళి' ప్రచారం ప్రారంభించిన సందర్భంగా కతిరియా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇది రేడియేషన్ చిప్, మీరు దీన్ని మీ మొబైల్‌లో ఉంచవచ్చు. ఈ చిప్‌ను మీ మొబైల్‌లో ఉంచితే అది రేడియేషన్‌ను గణనీయంగా తగ్గిస్తుందని, వ్యాధులను నివారించాలనుకుంటే అది ఉపయోగించబడుతుంది' అని అన్నారు.

చిప్‌కు 'గౌసత్వా కవాచ్' అని పేరు కూడా పెట్టరు, దీనిని రాజ్‌కోట్‌కు చెందిన శ్రీజీ గౌషాల అభివృద్ధి చేశారు. ఈ దీపావళిలో చైనా నిర్మిత దియాస్‌ను ఉపయోగించకుండా ఉండాలని వల్లభాయ్ కాతిరియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

500 కి పైగా గౌషాలలు యాంటీ రేడియేషన్ చిప్‌లను తయారు చేస్తున్నాయని కతిరియా చెప్పారు. వాటిని 50-100 రూపాయలకి కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఈ చిప్‌లను యుఎస్‌కు ఎగుమతి చేస్తున్నాడు, అక్కడ  దీని ఖరీదు $10.
 

click me!