సామాన్యుల అవసరాలను ఈ ఫౌండేషన్ నా కళ్ళు తెరిపించాయి: సుధా మూర్తి

By Sandra Ashok KumarFirst Published Oct 16, 2020, 11:00 AM IST
Highlights

సుధ మూర్తి ఇంజనీరింగ్ టీచర్. కన్నడ, మరాఠీ, ఆంగ్ల రచయిత అలాగే సామాజిక కార్యకర్త కూడా. ఆమె ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్. నారాయణ మూర్తి భార్య. సుధ మూర్తి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కెరీర్ ను ప్రారంభించింది.
 

బెంగళూరు: కొన్ని సామాజిక కారణాల వల్ల  31 డిసెంబర్ 2021 ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి పదవీ విరమణ చేయనున్నట్లు ఇన్ఫోసిస్, సిఎస్‌ఆర్ ఆర్మ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. సుధా మూర్తి  గత 25 సంవత్సరాలుగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ గా భాధ్యతలు నివహిస్తున్నారు.

సుధ మూర్తి ఇంజనీరింగ్ టీచర్. కన్నడ, మరాఠీ, ఆంగ్ల రచయిత అలాగే సామాజిక కార్యకర్త కూడా. ఆమె ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్. నారాయణ మూర్తి భార్య. సుధ మూర్తి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కెరీర్ ను ప్రారంభించింది.

సుధా మూర్తి 1996 డిసెంబర్‌లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. భారతదేశం అంతటా మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు సహాయపడే అనేక కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది.

also read 

సామాన్యుల అవసరాలను ఈ ఫౌండేషన్ ద్వారా నా కళ్ళు తెరిపించాయి. ఆరోహన్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డులను ప్రారంభించిన ఘనత కూడా సుధా మూర్తికి దక్కింది. దేశంలో సామాన్యుల అవసరాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా నా కళ్ళు తెరిపించాయి  అని సుధా మూర్తి అన్నారు.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రయాణంలో నా కుటుంబం, నా బృందం, సీనియర్ మేనేజ్‌మెంట్, వివిధ ఉద్యోగులు ఇలా చాలా మంది నన్ను సపోర్ట్ చేసిన వారు ఉన్నారు. మేము చేసిన జ్ఞాపకాలను నేను ఎంతో ఆదరిస్తాను, అలాగే నేను నిరుపేదలకు సహాయం చేసే నా ప్రయాణంలో స్వంతంగా కొనసాగుతాను.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభమైనప్పుడు నేను తల్లి ఈ ఫౌండేషన్ నా బిడ్డ. ఈ రోజు నేను వెళ్ళేటప్పుడు ఈ ఫౌండేషన్ ఒక తల్లిగా మారిందని, నేను చీన్న పిల్ల అని సంతృప్తి చెందుతున్నాను,"అని అన్నారు.

ఇన్ఫోసిస్‌లోని ఇండిపెండెంట్ డైరెక్టర్, సిఎస్‌ఆర్ కమిటీ చైర్మన్ కిరణ్ మజుందార్-షా మాట్లాడుతూ, “సుధ మూర్తి సామాజిక సేవా రంగంలో ఎంతో మందికి మార్గదర్శకురాలిగా ఉన్నారు. ఆమె సేవ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ” అని అన్నారు.
 

click me!