భారతదేశ జిడిపి వృద్ధిలో క్షీణత.. -11.8 శాతానికి దేశ ఆర్థిక వ్యవస్థ..

Ashok Kumar   | Asianet News
Published : Sep 08, 2020, 05:40 PM ISTUpdated : Sep 08, 2020, 11:39 PM IST
భారతదేశ జిడిపి వృద్ధిలో క్షీణత.. -11.8 శాతానికి దేశ ఆర్థిక వ్యవస్థ..

సారాంశం

 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి అంచనాను ఇండియా రేటింగ్స్ మంగళవారం -11.8 శాతానికి సవరించింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11.8 శాతం క్షీణిస్తుందని భారత రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి అంచనాను ఇండియా రేటింగ్స్ మంగళవారం -11.8 శాతానికి సవరించింది.

అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. భారతదేశ జిడిపి గణాంకాలు 1950-51 నుండి అందుబాటులో ఉన్నాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ఇది ఆరోసారి అని నివేదికలో పేర్కొంది. దీనికి ముందు, 1957–58, 1965-66, 1966-67, 1972–73 ఇంకా 1979–80 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. 1979-80 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద క్షీణతను నమోదైంది.

also read క్యాష్ డిపాజిట్లపై ఎస్‌బి‌ఐ క్లారీటి.. అది తప్పనిసరి కాదు, సజేషన్ మాత్రమే.. ...

ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ రూ.18.44 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. 2020-21లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 

ఫిచ్ రేటింగ్ కూడా దిగజారిపోతుందని అంచనా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ 10.5 శాతం పడిపోతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) జిడిపి 23.9 శాతం క్షీణించింది.

ఫిచ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపిపై మా అంచనాను -10.5 శాతానికి సవరించాము. ప్రపంచ ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం పాయింట్లు తగ్గుతుందని అంచనా. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా 28.1 శాతం క్షీణించింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్-జూన్ రెండవ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో క్షీణించింది.  

PREV
click me!

Recommended Stories

Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !
Salary Management: జీతం పడిన వెంటనే ఈ 8 పనులు చేస్తే లైఫ్ సెట్.. ఆర్థిక కష్టాలే రావు