దిగోస్తున్న బంగారం, వెండి ధరలు.. 5 రోజుల్లో 4సార్లు తగ్గుదల..

By Sandra Ashok KumarFirst Published Sep 8, 2020, 3:03 PM IST
Highlights

 ప్రపంచ ధరల క్షీణత వల్ల  భారత మార్కెట్లలో నేడు బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.5% పడిపోయి రూ.50,803కు చేరుకుంది. 

బంగారం ధరలు దిగోస్తున్నాయి. గత నెలలో బంగారం ధరలు పెరుగుతు వచ్చిన గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గుతు వస్తున్నాయి.  ప్రపంచ ధరల క్షీణత వల్ల  భారత మార్కెట్లలో నేడు బంగారం, వెండి ధరలు పడిపోయాయి.

ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.5% పడిపోయి రూ.50,803కు చేరుకుంది.  సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 0.6% పడిపోయి వెండి కిలోకు రూ.67,850కు చేరుకున్నాయి.అంతకు ముందు గోల్డ్ ఫ్యూచర్స్ లో పసిడి ధర  0.7%, వెండి 1.6% పెరిగింది.

also read 

బంగారం, వెండి ధరలు గత నెలలో గరిష్టం చేరి ఈ నెలలో కాస్త తగ్గింది.   ఆగస్టులో బంగారం ధరలు గరిష్ట స్థాయి చేరి 10 గ్రాములకి రూ.5,000, వెండి 10 గ్రాములకి రూ.10వేల లోపు తగ్గింది. స్పాట్ బంగారం 0.2% తగ్గి ఔన్సుకు 1,925.68 డాలర్ల వద్ద ఉంది.

డాలర్ సూచీ కూడా 0.45% పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుదల మరో వైపు యు.ఎస్-చైనా ఉద్రిక్తతలు మరింత పెరిగాయని విశ్లేషకులు అంటున్నారు. భారత్, చైనా వంటి కీలకమైన మార్కెట్లలో బంగారం కొనుగోళ్లపై వినియోగదారుల డిమాండ్ కూడా బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

click me!