E-passport: ఈ ఏడాది నుంచే ఈ-పాస్‌పోర్ట్ జారీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం..రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర మంత్రి..

Published : Apr 07, 2022, 06:23 PM IST
E-passport: ఈ ఏడాది నుంచే ఈ-పాస్‌పోర్ట్ జారీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం..రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర మంత్రి..

సారాంశం

కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే ఇ-పాస్‌పోర్ట్‌ (e-passport)లను జారీ చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి మురళీ ధరన్ రాజ్యసభలో తెలిపారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఇ-పాస్‌పోర్ట్‌ (e-passport)లు వేగవంతంగా పనిచేసేందుకు వీలు కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. 

2022-23 నుండి తమ పౌరులకు ఇ-పాస్‌పోర్ట్‌ (e-passport)లను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ గురువారంపేర్కొన్నారు. 2022 క్యాలెండర్ ఇయర్‌లో ఇ-పాస్‌పోర్ట్‌ (e-passport)ల జారీకి ప్రభుత్వ ప్రణాళికలు, దాని వివరాలపై అడిగిన ప్రశ్నకు మురళీధరన్ రాజ్యసభలో సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

అంతకు ముందు 2022 బడ్జెట్‌ ప్రసంగంలో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇ-పాస్‌పోర్ట్‌ (e-passport)కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2022-23 సంవత్సరంలో ఈ-పాస్‌పోర్ట్‌(e-passport)లు జారీ చేస్తామని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో పౌరులు విదేశాలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండే వీలుంది. 

ఈ-పాస్‌పోర్ట్‌(e-passport)లో చిప్‌ను ఇన్‌స్టాల్ చేస్తామని, ఈ టెక్నాలజీని 2022-23 సంవత్సరంలో విడుదల చేస్తామని  మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. దీనివల్ల పౌరులు విదేశాలకు వెళ్లడం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. డేటాకు సంబంధించిన భద్రతను మెరుగుపరచడానికి ఈ చిప్ ఉపయోగించబడుతుందని నిపుణులు పేర్కొన్నారు. పౌరుల కోసం ఈ-పాస్‌పోర్ట్ తీసుకురావడంపై మంత్రిత్వ శాఖ చర్చిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అంతకుముందు చెప్పారు.

తాజాగా రాజ్యసభలో కేంద్రమంత్రి మురళీ ధరన్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ... "పాస్‌పోర్ట్  కీలక సమాచారం దాని డేటా పేజీలో ముద్రించడంతో పాటు,  చిప్‌లో నిల్వ అవుతుందన్నారు. చిప్ ఎలా ఉండాలో ఫీచర్లను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) డాక్యుమెంట్ 9303లో పేర్కొన్న రీతిలోనే రూపొందిస్తాం" అని తెలిపారు. 

ఈ-పాస్‌పోర్ట్‌ (e-passport)ల జారీ సందర్భంలో టెక్నికల్ ఇష్యూస్ చూసే బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసి)కి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పగించిందని మురళీధరన్ తెలిపారు. అంతేకాదు "ఈ-పాస్‌పోర్ట్‌(e-passport)లను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఉత్పత్తి చేస్తుందని, ఇది దాని ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు 4.5 కోట్ల ICAO- కంప్లైంట్ ఎలక్ట్రానిక్ చిప్‌ల సేకరణ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లను జారీ చేసింది" అని ఆయన చెప్పారు. ప్రస్తుతం నమూనా ఇ-పాస్‌పోర్ట్‌(e-passport)లను పరీక్షిస్తున్నామని,  మౌలిక సదుపాయాలను పూర్తి చేయడంతో పూర్తి స్థాయి తయారీ మరియు ఇష్యూ ప్రారంభమవుతుందని MoS రాజ్యసభకు తెలియజేశారు.

ఈ-పాస్‌పోర్ట్ (e-passport) అంటే ఏమిటి?
ఇ-పాస్‌పోర్ట్ (e-passport) సాధారణంగా మీ సాధారణ పాస్‌పోర్ట్  డిజిటల్ వెర్షన్. ఇందులో ఎలక్ట్రానిక్ చిప్‌ని కలిగి ఉంటుంది. ఇది డేటా భద్రతకు సహాయపడుతుంది. ఈ మైక్రోచిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ పేరు సహా ఇతర సమాచారం ఉంటుంది.

ఈ పాస్‌పోర్ట్ జారీ చేసిన తర్వాత, పౌరులు ఇమ్మిగ్రేషన్ కోసం పొడవైన క్యూ నుండి బయటపడతారు. అందులోని చిప్ సహాయంతో పాస్‌పోర్ట్‌ను ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌లో సులభంగా స్కాన్ చేయవచ్చు.

చాలా దేశాల్లో ఈ-పాస్‌పోర్ట్ ట్రెండ్ ఉందని తెలుసుకుందాం. ఇది ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ దేశాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్‌పోర్ట్ వ్యవస్థ ఉంది. ఈ పాస్‌పోర్ట్ (e-passport) 64KB స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంది, దీనిలో వినియోగదారు వివరాలు నిల్వ చేయబడతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు