భారతదేశంలో కోటీశ్వరులు ఎంతలా పెరిగారో తెలుసా.. సంఖ్య వేలల్లోనే..

By Naga Surya Phani Kumar  |  First Published Aug 29, 2024, 7:38 PM IST

భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటూ ఎన్నో ఏళ్లుగా వింటున్న మాట ఇది. కాని మన దేశం ఎప్పడో అభివృద్ధి చెందింది. ఎందుకంటే కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్‌ ప్రకారం 2024లో భారత దేశంలో బిలియనీర్లు 1000 నుంచి 1500 కు పెరిగింది. వారిలో ఇప్పుడు 18 మంది వ్యక్తుల వద్దే రూ. 1 లక్ష కోట్లకు మించిన సంపద ఉంటుందట. ఆ రిపోర్ట్‌లో ఏముందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 


భారత దేశంలో అత్యంత ధనవంతులు ఎవరంటే అంబానీ లేదా అదానీ అని ఇట్టే చెప్పేయొచ్చు. ఎందుకంటే వీరిద్దరే మొదటి రెండు స్థానాల్లోనూ ఉంటారు. ఒకసారి అంబానీ ఉంటే మరోసారి అదానీ ఆ స్థానంలోకి వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎవరు భారత దేశంలో అత్యంత ధనవంతుడో తెలుసుకుందాం. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రిపోర్ట్‌ ప్రకారం 2024లో ప్రస్తుతం గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ 2వ స్థానానికి పడిపోయారు. 

ముఖేష్‌ అంబానీ ఇటీవలే తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన పెళ్లిగా  ఇది రికార్డుల్లోకెక్కింది. సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లి చేశారంటే ఎంత ఘనంగా చేశారో అర్థం చేసుకోవచ్చు. అలాగే అదానీ ఆస్తుల్లో తగ్గుదల కారణంగా ఇటీవల బిలీయర్ల జాబితాలో ఆయన కాస్త వెనుకబడే ఉన్నారు. అయినప్పటికీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ప్రస్తుతం అదానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. రూ.11.6 లక్షల కోట్ల నికర సంపదతో ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి భారతదేశపు అత్యంత సంపన్నుడిగా బిలియనీర్ గౌతమ్ అదానీ నిలిచారు. 

Latest Videos

హురున్ ఇండియా మరో జాబితా విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌ ద్వారా  భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య మొదటిసారిగా 300 దాటి, మొత్తం 334కి చేరుకుంది. అదనంగా, భారతదేశంలో రూ.1,000 కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య కూడా 1,500కి పెరిగింది. ఇది ఏడేళ్ల క్రితంతో పోలిస్తే 150% పెరుగుదలను సూచిస్తోంది.

అంబానీ, అదానీల ఆస్తి ఎంతంటే..
బిలియనీర్ గౌతమ్ అదానీ రూ.11.6 లక్షల కోట్ల నికర సంపదతో ముకేశ్ అంబానీని అధిగమించి భారతదేశపు అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రూ.10.14 లక్షల కోట్ల నికర సంపదతో ముఖేష్ అంబానీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. జాబితాలో అదానీ, అంబానీ తర్వాత శివ్ నాడార్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కుటుంబం మొత్తం రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో రూ.2.89 లక్షల కోట్ల సంపదతో సైరస్ ఎస్.పూనావాలా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) కుటుంబం, రూ.2.49 లక్షల కోట్లతో సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌కు చెందిన దిలీప్ శాంఘ్వి ఐదో స్థానంలో నిలిచారు.

హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం 2024లో భారతదేశం దాదాపు ప్రతి ఐదు రోజులకు ఒక బిలియనీర్ ఆవిర్భవించింది. భారతదేశంలో అల్ట్రా-హై-నెట్-వర్త్ వ్యక్తుల (HNWIలు) సంఖ్య 220 పెరిగి, మొత్తం 1,539కి చేరుకుంది. జాబితాలో 272 మంది కొత్త ప్రవేశాలు కూడా ఉన్నాయి. భారతదేశపు అల్ట్రా-హెచ్‌ఎన్‌ఐ సంఖ్య 1,500 దాటడం ఇదే మొదటిసారి. ఇది గత ఐదేళ్లలో 86% పెరుగుదలను సూచిస్తోంది. అదనంగా, భారతదేశం ఇప్పుడు 18 మంది వ్యక్తులతో రూ. 1 లక్ష కోట్లకు మించి సంపదను కలిగి ఉంది. 

click me!