మీ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు డిపాజిట్‌ చేస్తున్నారా.. అయితే మీకు నోటీసులు తప్పవు

By Naga Surya Phani KumarFirst Published Aug 29, 2024, 10:38 AM IST
Highlights

మనలో చాలా మందికి బ్యాంకు అకౌంట్‌లో ఎంత లిమిట్‌ వరకు డబ్బు డిపాజిట్‌ చేయవచ్చో తెలియదు. గరిష్ఠ పరిధి దాటి మీరు డబ్బులు వేశారో ఆదాయ పన్ను శాఖ మీకు నోటీసులు పంపిస్తుందని తెలుసా.. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
 

భారత దేశంలో అందరికీ బ్యాంకు అకౌంట్లు తప్పనిసరి అయిపోయాయి. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇవి తప్పనిసరి చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకులో అకౌంట్‌ తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి.  మన దేశంలో ఏ బ్యాంకులోనైనా అకౌంట్‌ తీసుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు. 

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు
చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయిస్తుంటాయి. అంటే ఖాతాలో నగదు లేకపోయినా వాటిని నిర్వహించవచ్చన్నమాట. అయితే కొన్ని ప్రైవేటు బ్యాంకులు, కమర్షియల్‌ అవసరాల కోసం తెరిచే అకౌంట్లు మినిమిమ్‌ రూ.1000 నుంచి రూ.5000, రూ.10000 బ్యాలెన్స్‌ ఉంచాలని నిబంధనలు పెడుతుంటాయి. ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులు మాత్రం జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు తెరిస్తే సరిపోతుంది. 

Latest Videos

బ్యాంకులు వడ్డీలు కూడా చెల్లిస్తాయి
బ్యాంకుల్లో అకౌంట్‌ తెరిచి డబ్బు నిల్వ చేసే వారికి ఆయా బ్యాంకులు వడ్డీలు కూడా చెల్లిస్తాయి. వాటి నిబంధనల ప్రకారం 6 శాతం నుంచి వడ్డీ చెల్లిస్తాయి. అందుకే చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉపయోగిస్తుంటారు.  

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, జీరో బ్యాలెన్స్ ఖాతా మినహా అన్ని ఖాతాలలో కనీస బ్యాలెన్స్ తప్పక మెయిన్‌టెయిన్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. అయితే పొదుపు ఖాతాలో గరిష్టంగా ఎంత మొత్తంలో ఉంచవచ్చో చాలా మందికి తెలియదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, మీరు మీ సేవింగ్స్ ఖాతాలో మీకు కావలసినంత డబ్బును ఉంచుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. 

సంవత్సరానికి రూ.10 లక్షలు..
కానీ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మీరు ఒక రోజులో రూ.లక్ష వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. అంతే కాకుండా ఒక సంవత్సరంలో మాక్సిమం రూ.10 లక్షల వరకు మన ఖాతాలో జమ చేసుకోవచ్చు. అయితే మీ ఖాతాలో పరిమితికి మించి ఎక్కువ ఉంటే ఆదాయపు పన్ను శాఖ తనిఖీ చేస్తుంది. ఆ డబ్బు ఎలా వచ్చిందన్న విషయం మీరు వారికి చెప్పాల్సి ఉంటుంది. 

రాడార్‌కు సంజాయిషీ..
మీరు కనుక సరైన కారణం చెప్పకపోయినా, ఆదాయపు పన్ను రిటర్న్‌లో సంతృప్తికరమైన సమాచారం ఇవ్వకపోయినా ఆదాయపు పన్ను శాఖకు చెందిన రాడార్ మిమ్మల్ని విచారించవచ్చు. మీ సంజాయిషీకి వారు తృప్తి చెందకపోతే భారీ జరిమానాలు కూడా విధిస్తారు.

భారీ ఫైన్‌ తప్పదు..
అలా అని డబ్బు ఎక్కువ డిపాజిట్‌ చేసుకోకూడదని అర్థం కాదు. సంవత్సరంలో రూ.10 లక్షలు దాటితే మీరు ఆదాయ, వ్యయాల ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే డిపాజిట్ చేసిన మొత్తంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్‌ఛార్జ్, 4 శాతం సెస్ విధిస్తారు. మీ వద్ద మీ ఆదాయానికి సంబంధించిన అన్ని రుజువులు ఉంటే మీరు హ్యాపీగా డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు.

 

click me!