ప్రపంచంలోని 3వ అతిపెద్ద డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్‌గా ఇండియా.. : రిపోర్ట్

By Ashok Kumar  |  First Published Jun 20, 2024, 6:49 PM IST

10 సంవత్సరాల సగటున భారతదేశ ఎయిర్‌లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాలలో అత్యధికంగా ఉంది, అయితే సంవత్సరానికి 6.9 శాతం పెరుగుతోంది. ఇతర దేశాల పనితీరు చూస్తే చైనా 6.3 శాతం, అమెరికా 2.4 శాతం, ఇండోనేషియా 1.1 శాతంగా ఉంది. 


ఏవియేషన్ రంగంలో భారతదేశం కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ప్రపంచంలోని మూడవ అతిపెద్ద డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్‌గా ఇండియా అవతరించింది. ఒక దశాబ్దం క్రితం ఐదవ స్థానంలో ఉన్న భారతదేశ డొమెస్టిక్  ఏవియేషన్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుంది. ఏప్రిల్ 2014 నాటి 7.9 మిలియన్ల నుండి 2024 నాటికి 15.5 మిలియన్లకు చేరుకుంది. ఈ దశాబ్ద కాలంలో ఏవియేషన్ రంగంలో భారత్ వృద్ధి రెట్టింపు అయ్యింది. బ్రెజిల్ (9.7 మిలియన్లు)ను నాలుగో స్థానానికి నెట్టి భారత్ మూడో స్థానానికి చేరుకుంది.   ఇండోనేషియా (9.2 మిలియన్లు) ర్యాంకింగ్‌లో ఐదో స్థానంలో ఉంది. అమెరికా (86.1 మిలియన్లు), చైనా (67.8 మిలియన్లు) మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి.

10 సంవత్సరాల సగటున భారతదేశ ఎయిర్‌లైన్ సీట్ల వృద్ధి రేటు మొదటి ఐదు దేశాలలో అత్యధికంగా ఉంది, అయితే సంవత్సరానికి 6.9 శాతం పెరుగుతోంది. ఇతర దేశాల పనితీరు చూస్తే చైనా 6.3 శాతం, అమెరికా 2.4 శాతం, ఇండోనేషియా 1.1 శాతంగా ఉంది. మొదటి ఐదు దేశాలతో పోలిస్తే  భారతదేశ తక్కువ ధర ఎయిర్ లైన్స్ ఉత్తమమైనవి. ఏప్రిల్ 2024 నాటికి, భారతదేశ డొమెస్టిక్  ఏవియేషన్  సామర్థ్యంలో 78.4 శాతం తక్కువ ధర ఉన్న  ఏవియేషన్  సంస్థల ద్వారానే ఉంది. ఇండిగో ఈ లిస్టులో ముందంజలో ఉంది. గత దశాబ్దంలో ఇండిగో మార్కెట్ వాటా 32 శాతం నుంచి 62 శాతానికి రెట్టింపు అయింది.

Latest Videos

ఈ వృద్ధికి సపోర్ట్ ఇవ్వడానికి భారతదేశంలో తగినంత విమానాశ్రయాలు ఉన్నాయా అనేది ప్రశ్న. చైనాలో 250 విమానాశ్రయాలు,  యుఎస్‌లో 656 విమానాశ్రయాలు ఉండగా, భారతదేశంలో మొత్తం 119 విమానాశ్రయాలు డొమెస్టిక్ విమానాలకు సేవలు అందిస్తున్నాయి.

click me!