
'దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఎట్టకేలకు వెనక్కి తగగింది. ఆగస్టు 1న ప్రకటించిన వివాదాస్పద నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కస్టమర్ల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో, సేవింగ్స్ ఖాతాల కనీస నిల్వ (MAB) మొత్తాన్ని రూ.50,000 నుంచి రూ.15,000కు తగ్గించినట్లు ప్రకటించింది.
మెట్రో & అర్బన్ ప్రాంతాలు: రూ.15,000 (మునుపు రూ.50,000)
సెమీ-అర్బన్: రూ.7,500 (మునుపు రూ.25,000)
గ్రామీణ: రూ.2,500 (మునుపు రూ.10,000)
మినహాయింపులు: 60 ఏళ్లు పైబడిన పెన్షనర్లు, ఎంపిక చేసిన 1,200 విద్యాసంస్థల విద్యార్థులకు కనీస నిల్వ అవసరం లేదు.
ఆగస్టు 1న ప్రకటించిన రూ.50,000 MAB నిర్ణయం వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. ఒక X యూజర్ వ్యాఖ్యలో, నెలకు రూ.1 లక్ష వేతనం వచ్చినా EMIలు, బిల్లులు, లోన్లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపుల తర్వాత రూ.50,000 నిల్వ ఉంచడం సాధ్యం కాదు అని పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా స్పందించించి. కస్టమర్ల అభిప్రాయాలు, వారి ఆర్థిక పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పరిమితులను నిర్ణయించాం” అని తెలిపింది.
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకారం, కనీస నిల్వ నిర్ణయం పూర్తిగా బ్యాంకుల పైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు రూ.10,000, మరికొన్ని రూ.2,000 కనీస నిల్వగా ఉంచాయి. కొన్ని పూర్తిగా మినహాయించాయి. ఇది RBI నియంత్రణలో ఉండే అంశం కాదు అని ఆయన అన్నారు.
HDFC బ్యాంక్ అర్బన్ – రూ.10,000, సెమీ-అర్బన్ – రూ.5,000
కోటక్ మహీంద్రా బ్యాంక్: రూ.10,000
YES బ్యాంక్: సేవింగ్ ఖతా స్కీమ్ ఆధారంగా మారుతుంది
SBI, PNB వంటి ప్రభుత్వ బ్యాంకులు MAB జరిమానాలను పూర్తిగా రద్దు చేశాయి.
ఐసీఐసీఐ బ్యాంకులో కనీస నిల్వ లేకపోతే, లోటు మొత్తంలో 6% లేదా రూ.500 – ఏది తక్కువైతే – అది జరిమానాగా వసూలు అవుతుంది.