
పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తు కోసం పొదుపు చేయడం. ఎన్నో పెట్టుబడి అవకాశాలు ఇప్పుడు మన దేశంలో ఉన్నాయి. అయితే ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలామంది ముందడుగు వేయకుండా ఉండిపోతారు. మీ ఆర్థిక అవసరాలకు తగ్గట్టు మీ పెట్టుబడులు పెట్టుకోవాలి. భారతదేశంలో అధిక రాబడితో రిస్క్ తక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ల గురించి ఇక్కడ మేము ఇచ్చాము. ఇందులో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి.
భారతదేశంలో అధిక రాబడితో కూడిన సురక్షితమైన పెట్టుబడి ఫిక్స్డ్ డిపాజిట్. దీంట్లో రిస్క్ ఏమీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చిన సమయానికి స్థిరమైన రాబడిని ఇస్తుంది.
దీన్ని పిపిఎఫ్ అంటారు. భారతదేశంలో అధిక రాబడితో కూడిన సురక్షితమైన పెట్టుబడి ఇది. మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఎక్కడైనా దీన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది ఉత్తమమైన మార్గం.
బంగారం రేటు పెరగడమేగాని తగ్గడం అనేది భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అధిక రాబడితో అత్యంత సురక్షితమైన పెట్టుబడి బంగారం మీద పెట్టడం. మీకు డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొని పెట్టుకోండి. అది రెట్టింపు ధరకు వెళుతుంది... కానీ తక్కువ ధరకు ఎప్పుడు అమ్ముడవ్వదు. కాబట్టి బంగారం అత్యుత్తమమైన పెట్టుబడిగానే చెప్పుకోవాలి.
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ అనేది స్థిరమైన ఆదాయ పెట్టుబడికి ఉత్తమమైన ప్లాన్. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్ళండి. అక్కడ వారు దీని గురించి వివరిస్తారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ అనేది మీకు అద్భుతమైన రాబడిని ఇచ్చే సేవింగ్స్ స్కీము.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత దేశంలోనే ఉన్నతమైన బ్యాంకు. అధిక రాబడితో సురక్షితమైన పెట్టుబడులు పెట్టడానికి ఇది అవకాశాలను ఇస్తుంది. ఆర్బీఐ బాండ్లు కొనుక్కోవడం ద్వారా మీరు రెట్టింపు డబ్బును సంపాదించవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా బాండ్లను అమ్ముతుందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని బాండ్లను జారీ చేస్తాయి. అవి అధిక రాబడితో పాటు సురక్షితమైన పెట్టుబడులు అందిస్తాయి. కాబట్టి వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఆడపిల్ల కోసం డబ్బులు దాయాలనుకునే వారికి ఇది ఉత్తమమైన పథకం. మీరు మీ ఆడపిల్ల కోసం భారతదేశంలో అధిక రాబడితో సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయండి. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం. మీ కుమార్తె భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఈరోజే సుకన్య సమృద్ధి యోజన లో చేరండి.
అరవై ఏళ్లు దాటిన వారికి సీనియర్ సిటిజన్ అని అంటారు. వారి కోసమే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో ఉన్న వృద్ధుల కోసం అధిక రాబడితో కూడిన సురక్షితమైన పెట్టుబడి ఇది. వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీము అన్ని విధాలా ఉపయోగపడుతుంది.
రియల్ ఎస్టేట్‌లో ప్రభుత్వ పథకాలు ఏమీ ఉండవు.కానీ మీరు మీ దగ్గర ఉన్న డబ్బులతో ఒక భూమి లేదా పొలం కొనడం వల్ల దాని ధర భవిష్యత్తులో రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.అన్నిచోట్లా రేటు పెరగాలని లేదు... ఎక్కడ ఏ ప్రాంతంలో రేట్లు పెరుగుతున్నాయో... ఆ చోట భూమి కొంటె భవిష్యత్తులో అది మీకు రెట్టింపు ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడిగానే చెప్పుకోవాలి.