ఐకియాకి మరో షాక్.. మొన్న బిర్యానీలో, ఇప్పుడు కేకులో పురుగు

Published : Sep 20, 2018, 10:44 AM ISTUpdated : Sep 20, 2018, 10:45 AM IST
ఐకియాకి మరో షాక్.. మొన్న బిర్యానీలో, ఇప్పుడు కేకులో పురుగు

సారాంశం

కొద్ది రోజుల క్రితం ఓ కష్టమర్ ఐకియా రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేస్తే.. అందులో గొంగలి పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందో అలాంటిదే మరో సంఘటన  చోటుచేసుకుంది.

హైదరాబాద్ నగరంలో తాజాగా ఏర్పాటు చేసిన ఐకియా స్టోర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందులో లభించే ఫుడ్ సరిగా ఉండటం లేదని కష్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కష్టమర్ ఐకియా రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేస్తే.. అందులో గొంగలి పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందో అలాంటిదే మరో సంఘటన  చోటుచేసుకుంది.

ఓ కష్టమర్ కి ఐకియాలోని రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ చాక్లెట్ కేకు ఆర్డర్ చేయగా.. అందులో బొద్దిక పాకుతూ కనపడింది. వెంటనే దానిని ఫోటో తీసి ఆ కష్టమర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది ఐకియా స్టోర్ కి చేరుకొని పరీక్షలు చేశారు. ఆ చాక్లెట్ కేకు సంబంధించిన కొన్ని శాంపిల్స్ సేకరించారు.

అంతేకాకుండా సంస్థకి రూ.5వేల జరిమానా కూడా విధించారు. శాంపిల్స్ ని పరిశీలించి కంపెనీపై చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఐకియా స్టోర్ ప్రారంభించి రెండు నెలలు కూడా పూర్తికకముందే ఇలాంటి సంఘటనల రెండు ఎదురవ్వడంతో.. స్టోర్ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లోకి స్టోర్ పై నెగిటివ్ టాక్ వస్తుందేమోనని ఆందోళన పడుతున్నట్లు సమాచారం. 

read more news

ఐకియా స్టోర్ కి షాక్.. బిర్యానీలో గొంగలి పొరుగు.. భారీ జరిమానా

 

PREV
click me!

Recommended Stories

Infosys : ఫ్రెషర్లకు జాక్ పాట్.. ఇన్ఫోసిస్ లో రూ. 21 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు !
Best Drone Cameras : ఏమిటీ..! కేవలం రూ.5,000 కే 4K డ్రోన్ కెమెరాలా..!!