నటి తమన్నా భాటియా సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముంబైలో ఓ కమర్షియల్ బిల్డింగ్ ద్వారా ఆమెకు వచ్చే రెంట్స్ ఎంతో తెలుసా?
ముంబై : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినిమాలో నటించేందుకు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఉంటుందట. అయితే ఒక్క ఐటెం సాంగ్‌లో కనిపించేందుకు ఆమె తీసుకునే మొత్తం అక్షరాలా 2 కోట్ల రూపాయలు. సినిమాల ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తునే అద్దె(rents) ద్వారా కూడా తమన్నా లక్షలు సంపాదిస్తుంది.
తమన్నాకి ముంబైలోని జుహు తారా రోడ్‌లో ఓ కమర్షియల్ బిల్డింగ్ ఉంది. దాని ద్వారా ప్రతినెలా రూ.18 లక్షలు రెంట్ వస్తుంది.
అవును.. తమన్నా జుహు తారా రోడ్ కమర్షియల్ బిల్డింగ్ ద్వారా ప్రతి నెలా 18 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఈ బిల్డింగ్‌ను 5 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చారు. దీని ద్వారా తమన్నా ప్రతినెలా అద్దెగా తీసుకుంటోంది. మొదటి మూడేళ్లు నెలకు రూ.18 లక్షలు, 4వ సంవత్సరంలో నెలకు రూ.20.16 లక్షలు, 5వ సంవత్సరంలో నెలకు రూ.20.96 లక్షలు అద్దె కట్టాల్సి ఉంటుంది.
6,065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కమర్షియల్ బిల్డింగ్‌ని తాజాగా జూన్ 27, 2024న లీజుకు తీసుకున్నారు. ఇందుకు తమన్నా 74 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ అందుకుంది. కాగా, రానున్న 5 సంవత్సరాల తరువాత అదే కమర్షియల్ బిల్డింగ్ ప్రతినెలా అద్దె 50 లక్షల రూపాయలకు దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు.
ఒకవైపు తమన్నా అద్దెల ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తూండగా.. అంధేరి వెస్ట్‌లో మూడు ఇళ్లు కూడా ఉన్నాయి. వీటిని మొత్తం రూ.7.84 కోట్లకు ఆమె కొన్నట్లు సమాచారం.
తమన్నా ముంబైలోని జుహు వెర్సోవా రోడ్‌లోని బెవ్యూ అపార్ట్‌మెంట్‌లో 14వ అంతస్తులోని తమన్నా నివసిస్తోంది. దీన్ని రూ.16 కోట్లకు తమన్నా కొన్నారు. 9 ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటోంది.