ఎస్‌బి‌ఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.... ఇంటి నిర్మాణం.. పేరుతో కొత్త పథకం

By Sandra Ashok KumarFirst Published Jan 10, 2020, 11:23 AM IST
Highlights

సకాలంలో బిల్డర్ ఇంటి నిర్మాణం పూర్తి చేయకుంటే ఇంటి రుణం తీసుకున్న ఖాతాదారుల ఖాతాల్లో మిగతా మొత్తం నగదు రీఫండ్ చేస్తుంది ఎస్బీఐ. ఇంటి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు.

ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు  శుభవార్త చెప్పింది. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ‘సప్నా ఆప్‌కా, భరోసా ఎస్‌బీఐ కా’  అనే పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. ‘రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారెంటీ’ పేరుతో కొత్త గృహ రుణ పథకాన్ని తీసుకొచ్చింది. 

బిల్డర్‌ హామీ ఇచ్చిన నిర్దేశిత గడువులోగా ఇంటిని అప్పగించకపోతే.. కొనుగోలుదారుడికి ప్రిన్సిపల్‌ మొత్తాన్ని రిఫండ్‌ చేయటం ఈ పథకం ప్రత్యేకత. దీని ప్రకారం ఎస్‌బీఐ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి గడువు లోగా ప్రాజెక్టు పూర్తికాకపోతే డబ్బు వాపస్ ఇస్తామంటోంది. 

also read ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం... ఇండియాని భయపెడుతున్న చమురు ధరలు

ఉదాహరణకు ఒక ప్రాజెక్టులో ఒక ఫ్లాట్‌ ధర రూ.2 కోట్లు అయితే కొనుగోలుదారుడు ఆ ఫ్లాట్‌ను రూ. కోటి చెల్లించి బుక్‌ చేసుకున్న తర్వాత.. సదరు ప్రాజెక్ట్‌లో జాప్యమైతే కస్టమర్‌కు ఆ మొత్తాన్ని బ్యాంక్‌ రిఫండ్‌ చేస్తుంది. బిల్డర్‌ ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ పొందేంత వరకు మాత్రమే ఈ రిఫండ్‌ పథకం వర్తిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు. 

ఈ పథకాన్ని తొలుత ముంబై నగరంలో ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ సంస్థతో ఎస్‌బీఐ ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తమ ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని  ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్  మీడియాకు వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. 

రేరా, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు ఇరుక్కుపోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందని రజనీశ్ కుమార్  భరోసా ఇచ్చారు.ఎన్నో ఆశలతో  సొంతింటి కల సాకారం కోసం బ్యాంకు రుణాలు తీసుకుని మరీ  సొమ్మును పలు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుపెట్టి, అవి సమయానికి పూర్తికాక మధ్యలో నిలిచిపోవడంతో ఇబ‍్బందులు పడుతున్నవినియోగదారులకు  పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు బ్యాంకు తెలిపింది. 

ఈ పథకం గరిష్టంగా రూ 2.5 కోట్ల విలువ ఉన్న గృహాలకు వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో చేరే బిల్డర్లు తమ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు సుమారు రూ 50 కోట్ల నుంచి రూ 400 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. మరిన్ని వివరాలు homeloans.sbi లో లభ్యం. గృహ రుణాల విషయమై దేశంలో మరే బ్యాంక్‌ లేదా గృహ ఫైనాన్స్‌ కంపెనీ ఇప్పటి వరకు ఇలాంటి పథకం తీసుకురాలేదు. దీంతో ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. 

ఎస్‌బీఐ ప్రేరణతో మిగతా సంస్థలూ ఇలాంటి గృహ రుణ పథకాలు ప్రారంభించే అవకాశం ఉంది. తొలుత ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం (ఎంఎంఆర్‌)లో సన్‌టెక్‌ డెవలపర్స్‌కు చెందిన మూడు ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనే వారి కోసం ఎస్‌బీఐ ఈ కొత్త హోమ్‌ లోన్‌ పథకం కింద గృహ రుణాలు సమకూర్చబోతోంది. ఆ తర్వాత దశల వారీగా మిగతా నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. కాగా రిఫండ్‌ చేసే వరకు ‘అసలు’పై వడ్డీ ఉంటుందా? లేదా? అనే విషయాన్ని ఎస్‌బీఐ వెల్లడించలేదు.

also read దిగోచ్చిన బంగారం ధరలు... ప్రస్తుత ధరెంతంటే.....?
 
ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.2.5 కోట్ల వరకు విలువైన ఇళ్ల కొనుగోలుకు గృహ రుణాలు లభిస్తాయి. అర్హత ఉన్న బిల్డర్ల ప్రాజెక్టుల్లోని ఇళ్ల కొనుగోలుకు మాత్రమే ఈ రుణ పథకం కింద రుణాలు మంజూరవుతాయి. అర్హత ఉన్న బిల్డర్ల ప్రాజెక్టులకు రూ.50 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ుంది.

అయితే ఈ పథకం ద్వారా ఎస్‌బీఐ రుణ సౌకర్యం పొందిన బిల్డర్‌, ఆపరేషనల్‌ క్రెడిటార్ల నుంచి అప్పుపై సేవలు పొందే అవకాశం ఉండదు ప్రాజెక్టుల ద్వారా బిల్డర్‌కు వచ్చే ఆదాయం అంతా ఎస్ర్కో ఖాతాలో వేయాల్సి ఉంటుంది. ముందుగా దేశంలోని 10 నగరాల్లో ఈ పథకం అమలు. తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించాలని ఎస్బీఐ ప్రణాళికలు రచిస్తోంది. 
 

click me!