ఈ సందర్భంగా కార్యక్రమంలో మహిళా సంఘాలకు రూ.29 లక్షల విలువైన చెక్కును నారా బ్రాహ్మణి అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెరిటేజ్ సంస్థ అధికారులు, ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు.
హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) నారా బ్రాహ్మణి పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. హెరిటేజ్ డెయిరీలో పాడి రైతుల సమావేశాన్ని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం శంకరాపురంలో సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘సమతుల పశువుల దాణా, దాణా సప్లిమెంట్లను సరసమైన ధరలకు అందించడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ల సహాయంతో బ్రీడ్‌ను అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పాల ఉత్పత్తుల సంస్థల్లో హెరిటేజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,327.40 కోట్ల టర్నోవర్‌ను సాధించగలిగాం’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో మహిళా సంఘాలకు రూ.29 లక్షల విలువైన చెక్కును నారా బ్రాహ్మణి అందజేశారు. డెయిరీలో ఏర్పాటు చేసిన 25 వేల లీటర్ల పాలు, 20 వేల లీటర్ల పెరుగు ఉత్పత్తి సదుపాయం, ప్యాకింగ్ సౌకర్యాన్ని బి.కొత్తపేటలోని బెంగళూరు రోడ్డు, సంత బజారు వీధిలో పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెరిటేజ్ సంస్థ అధికారులు, ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు.