మంగళవారం మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభం అయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ నిఫ్టీ లో లాభాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రారంభ లాభాలు ఆవిరి అయిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.
గ్లోబల్ మార్కెట్ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో, భారతీయ స్టాక్ మార్కెట్ కూడా ఫ్లాట్ గా ప్రారంభం అయ్యాయి. వారంలో రెండో రోజు అయిన మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌తో ప్రారంభమైంది. ఆరంభం కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ, దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌మార్క్‌తో ప్రారంభమయ్యాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ప్రారంభమైంది. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు అయిన ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50, బిఎస్‌ఇ సెన్సెక్స్ మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
నిఫ్టీ 50 ఓపెనింగ్ లో 19,400 స్థాయి ఎగువన ప్రారంభమైంది.సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడి 65,272.42 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెెక్స్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ ఒక్కొక్కటి 0.4 శాతం చొప్పున పెరిగాయి. అయితే ఇండియా VIX 2.6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఔట్ పెర్ఫార్మ్ చేయడంతో బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడవుతోంది. నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి 0.03 శాతం క్షీణించింది.
సెక్టోరల్ ఫ్రంట్‌లోని అన్ని ఇతర సూచీలతో పాటు నిఫ్టీ బ్యాంక్ కూడా గ్రీన్‌లో ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్ 0.16 శాతం పెరిగి 44,074.55 వద్ద ఉంది. టాప్ గెయినర్లుగా HDFC Life Insurance, Adani Enterprises Lt, SBI Life Insurance, NTPC, ITC Ltd షేర్లు ఉన్నాయి. టాప్ లూజర్లలో LTIMindtree, Tech Mahindra, Infosys, Tata Consultancy, Cipla షేర్లు ఉన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో రెడ్ లో ట్రేడవుతున్నాయి.