Bill Gates: బిల్ గేట్స్ మెచ్చిన మహిళా పోస్ట్ మాస్టర్ ఎవరు...ఆమె నేపథ్యం ఏంటి..? సాధించిన విజయం ఏంటి..?

By Krishna Adithya  |  First Published Aug 22, 2023, 10:56 AM IST

బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న అపర కుబేరుడు బిల్గేట్స్ తాజాగా భారతదేశంలో పర్యటన సందర్భంగా ఓ మహిళ పోస్ట్ మాస్టర్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అసలు ఎవరా మహిళా పోస్టు మాస్టర్ ఆమె కథ ఏంటి తెలుసుకుందాం.


 ప్రపంచ కుబేరుల్లో ఒకరు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు,  బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి బిల్ గేట్స్ తాజాగా తాను భారత్ లో పర్యటించినప్పుడు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు ఇందులో భాగంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి ఓ మహిళ ఉద్యోగిని  అయినా కుసుమ అనే పోస్ట్ మాస్టర్  గురించి  ప్రత్యేకంగా పేర్కొన్నారు.  ముఖ్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటల్ ఇండియాకు ప్రోత్సాహం అందిస్తున్న నేపథ్యంలో,  పౌరులకు డిజిటల్ సేవలను అందించేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ప్రధాన భూమిక నిర్వహిస్తోంది.  బెంగళూరులో విధులు నిర్వహించే కుసుమ తమ పోస్టు ఆఫీసుకు వచ్చే  కస్టమర్లకు డిజిటల్ ఫైనాన్స్ పట్ల అవగాహన కల్పిస్తోంది.  ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో  బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకునే వారికి కుసుమ తన చొరవతో,  కస్టమర్లను డిజిటల్ సేవల దిశగా ప్రోత్సహిస్తోంది. 

ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో అందిస్తున్నటువంటి అనేక చిన్న మొత్తాల పొదుపులో పథకాలను పౌరులకు చేరవేయడంలో పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతుంది.  ఇందులో భాగంగా కుసుమ సైతం తమ బ్రాంచ్ లోకి  వచ్చే కస్టమర్లకు డిజిటల్ సేవల పట్ల అవగాహన కల్పిస్తోంది.  కేవలం పురుషులు మాత్రమే అత్యధిక ఒత్తిడితో  పనిచేయగలరు అనే  పద్ధతికి భిన్నంగా  స్త్రీలు సైతం  పోస్టల్ రంగంలో రాణించవచ్చని కుసుమ నిరూపించింది. 

Latest Videos

కుసుమ సాధించినటువంటి ఈ విజయాన్ని బిల్ గేట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.  అంతేకాదు ఆమెతో దిగినటువంటి ఫోటోలు సైతం షేర్ చేశారు.  దీంతోపాటు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కుసుమ జీవితంపై నిర్మించినటువంటి ఓ డాక్యుమెంటరీని సైతం ఆ సోషల్ మీడియా పోస్టులో జతపరిచారు.  ప్రస్తుతం కుసుమ కథ తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిల్గేట్స్ అభిమానులు ఆత్రుతగా ఉన్నారు. 

మరోవైపు భారత దేశంలో డిజిటల్ సేవలను అందించేందుకు ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో సేవలను పౌరులందరికీ సులభంగా అందేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోంది ఇందులో భాగంగా ఇప్పటికే డిబిటి ( డైరెక్టు టు బెనిఫిషియరీ ట్రాన్స్ ఫర్) పద్ధతిలో   పలు పథకాలకు సంబంధించినటువంటి డబ్బును నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ చేస్తుంది.  గతంలో కోవిడ్ సమయంలో దాదాపు 80 కోట్ల మందికి  డిబిటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం సైతం అందించింది.  అలాగే డిబిటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా పీఎం కిసాన్ యోజన పేరిట సహాయం సైతం అందిస్తోంది.  ప్రతిఏటా 6000 రూపాయలు ఈ స్కీం కింద లభిస్తాయి. 

అంతేకాదు డిజిటల్ ఇండియా లో భాగంగా మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను  బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  అందులో భాగంగానే జనధన ఖాతాలను ప్రారంభించింది.  జీరో అకౌంట్లతో ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తేవడమే జన ఖాతా లక్ష్యం.  ప్రస్తుతం యూపీఐ ద్వారా చెల్లింపులు సైతం నగదు  రహితంగా జరిపే  వ్యవస్థ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది 

 

click me!