voter id: ఓటర్‌ ఐడీని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? డౌన్‌లోడ్‌ ఎలా.? ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది.. పూర్తి వివరాలు

Published : Jan 23, 2025, 10:46 AM ISTUpdated : Jan 23, 2025, 10:47 AM IST
voter id: ఓటర్‌ ఐడీని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? డౌన్‌లోడ్‌ ఎలా.? ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది.. పూర్తి వివరాలు

సారాంశం

భారత ప్రజాస్వామ్య సౌందర్యాన్ని పెంపొందించే ఎన్నికల్లో పాల్గొనాలంటే ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఓటర్‌ ఐడీ పేరుతో గుర్తింపు కార్డును అందిస్తుంది. ఇది కేవలం ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అధికారిక గుర్తింపు కార్డుగా చెల్లుబాటు అవుతుంది. ఇంకీ ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి, సవరించడం సాధ్యమేనా అనే పూర్తి సమాచారం మీకోసం..    

ఓటరు గుర్తింపు కార్డు అంటే ఏమిటి?

ఓటరు గుర్తింపు కార్డును ఓటరు ఫోటో గుర్తింపు కార్డ్ (EPIC) అని కూడా పిలుస్తారు. ఓటు వేయడానికి అర్హత ఉన్న భారతీయ పౌరులందరికీ భారత ఎన్నికల సంఘం జారీ చేస్తుంది. ఓటరు జాబితా కచ్చితత్వాన్ని మెరుగుపరచడం, ఎన్నికల మోసాల కేసులను నిరోధించడమే ఈ గుర్తింపు కార్డు ముఖ్య ఉద్దేశ్యం. అర్హులైన ఓటర్లు ఓటు వేసినప్పుడు ఈ కార్డు గుర్తింపు రుజువుగా పరిగణిస్తారు. ఈ కార్డును సాధారణంగా ఎలక్షన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అని కూడా అంటారు. ఓటర్ల జాబితా కచ్చితత్వాన్ని మెరుగుపరచడం, ఎన్నికల మోసాలను నిరోధించడం ఈ కార్డు ప్రధాన లక్ష్యంగా చెబుతారు. అర్హతగల భారతీయ పౌరులు ఓటు వేసినప్పుడు ఇది గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఓటరు ఐడీ కార్డ్ లేదా EPIC కార్డ్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఓటరు కార్డుపై జాతీయ చిహ్నంతో పాటు ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. అలాగే కార్డుపై తండ్రి లేదా భర్త పేరు ఉంటుంది. అలాగే లింగం, పుట్టిన తేదీ, నివాసం చిరునామా ఉంటుంది. అలాగే గుర్తింపు కార్డు వెనకాల ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం ఉంటుంది. 

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

స్టెప్‌1: ముందుగా ఓటర్ సర్వీస్ అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి. లేదా నేరుగా ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి.

స్టెప్‌2: 'సైన్-అప్'పై క్లిక్ చేసి, లాగిన్ ఖాతాను ఓపెన్‌ చేయాలి. 

స్టెప్‌ 3: 'ఇండియన్ రెసిడెంట్ ఓటర్లు' కింద మీ మొబైల్ నంబర్‌ను క్యాప్చాతో నమోదు చేయండి. 'కంటిన్యూ'పై క్లిక్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత, 'ఫామ్‌ 6ని ఫిల్‌'పై క్లిక్ చేయాలి. అందులో అడిగిన సమాచారాన్ని అందించి ఫామ్‌ ఫిల్‌ చేయాలి. 

స్టెప్‌ 4: ఫోటోతో సహా అన్ని అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 

స్టెప్‌ 5: చివరిగా'సబ్‌మిట్‌'పై క్లిక్ చేయాలి. 


ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

ఇందుకోసం ముందుగా ఫామ్‌6ని డౌన్‌లోడ్‌ చేసుకొని సమాచారాన్ని నింపాలి. అనంతరం ఈ ఫామ్‌ను బూత్ లెవల్ ఆఫీసర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు/అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల కార్యాలయాల్లో ఉచితంగా లభిస్తాయి. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు నింపిన ఫామ్‌ను అందించాలి బూత్ లెవల్ అధికారికి పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు. పూర్తి సమాచారం కోసం 1950కి కాల్ చేయొచ్చు. 

ఓటరు గుర్తింపు కార్డుపై EPIC నంబర్ అంటే ఏమిటి?

EPIC (ఓటర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) నంబర్ అనేది భారత ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డ్ నంబర్. EPIC నంబర్ అనేది 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులకు గుర్తింపు రుజువుగా ఉపయోగపడే సంఖ్య. ఇది దేశంలో జరిగే వివిధ ఎన్నికలలో భారతీయ పౌరులు ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. ఓటరు గుర్తింపు కార్డుపై EPIC నంబర్ నమోదు చేస్తారు. ఓటరు ID ఫోటో పైభాగంలో ఈ ఎపిక్ నంబర్ ఉంటుంది.

ఆన్‌లైన్‌లో EPIC నంబర్‌ని ఎలా కనుగొనాలి?

స్టెప్‌ 1: ముందుగా 'ఓటర్స్ సర్వీస్ పోర్టల్' అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

స్టెప్‌ 2: ఆ తర్వాత 'సెర్చ్ ఎలక్టోరల్ రోల్' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

స్టెప్‌ 3: 'ఏపిక్‌ సెర్చ్‌', 'డీటెయిల్‌ సెర్చ్‌', లేదా 'సెర్చ్‌ ఫ్రమ్‌ మొబైల్‌' ఆప్షన్స్‌ కింద అవసరమైన వివరాలను ఫిల్‌ చేయాలి. 

స్టెప్‌ 4: క్యాప్చ్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసి 'సెర్చ్‌' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే పేర్ల జాబితా వస్తుంది. అందులో ఎపిక్‌ నెంబర్‌ను కనిపెట్టవచ్చు. 

ఓటరు గుర్తింపు కార్డు కోసం ఏ పత్రాలు అవసరం?

ఓటరు ID కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏదైనా ఐడీ ప్రూఫ్‌, అడ్రస ప్రూఫ్‌ అవసరపడతాయి. 

ఓటరు కార్డు పొందడానికి అర్హతలు.? 

భారతీయ పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడి ఉండాలి. కచ్చితంగా ఆ నియోజకవర్గ వాసి అయి ఉండాలి. ఓటరును ఏ కారణంతోనూ అనర్హులుగా ప్రకటించకూడదు.

ఓటరు ID అప్లికేషన్ స్థితిని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?

ఇందుకోసం ముందుగా https://www.nvsp.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం 'ట్రాక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌'పై క్లిక్‌ చేయాలి. అనంతరం రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌, ఇమెయిల్‌ ఐడీ లేదా ఎపిక్‌ నెంబర్‌ ఎంటర్ చేయాలి. రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత 'ట్రాక్‌ స్టేటస్‌'పై క్లిక్‌ చేయాలి. 

ఓటరు గుర్తింపు కార్డును ఎలా ధృవీకరించాలి?

నేషనల్ ఎలక్టోరల్ సర్వీసెస్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి, 'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్'పై క్లిక్ చేయాలి. అడిగిన విధంగా వ్యక్తిగత వివరాలను ఇవ్వడం ద్వారా లేదా EPIC నంబర్ ఇవ్వడం ద్వారా ఓటరు జాబితాను ధృవీకరించవచ్చు.

EPIC నంబర్‌ని ఉపయోగించి ఓటర్ ID కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్టెప్1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌ని సందర్శించండి – voterportal.eci.gov.in.

స్టెప్2: అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. 

స్టెప్3: ఆ తర్వాత హోమ్‌ పేజీలో 'e-EPIC డౌన్‌లోడ్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

స్టెప్‌ 4: మీ e-EPIC నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్ 5: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. 

స్టెప్6: 'డౌన్‌లోడ్'పై క్లిక్ చేయండి. 

గమనిక:  ఇ-ఎపిక్ నంబర్ తప్పుగా ఉంటే, మీరు దానిని voterportal.eci.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు. మొబైల్ ఓటర్ యాప్ ద్వారా డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును రూపొందించవచ్చు. గూగుల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. 

ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో ఓటర్ ఐడీని డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Google Play Store లేదా Apple Store నుండి, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసకోవాలి. ఆ తర్వాత 'పర్సనల్ వాల్ట్' ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) వంటి అవసరమైన వివరాలను నమోదు చేసి, 'లాగిన్'పై క్లిక్ చేయాలి. మీ ఇ-ఎపిక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆపై కార్డు పొందడానికి 'డౌన్‌లోడ్'పై క్లిక్ చేయాలి. డిజిటల్ ఓటర్ ఐడీని మొబైల్ లో ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి. 

ఏ మార్పునకు ఏ ఫామ్‌ కావాలంటే.. 

ఫారమ్ 6: కొత్త ఓటరు ID కార్డ్, నియోజకవర్గం మార్పు కోసం

ఫారం 6A: NRI ఓటర్లు ఎన్నికల కార్డు పొందడానికి ఈ దరఖాస్తును సమర్పించాలి.

ఫారం 8: చిరునామా, ఫోటో, వయస్సు, పేరు, పుట్టిన తేదీ మొదలైన వ్యక్తిగత వివరాలను మార్చడానికి. 

ఫారం 8A: ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి చిరునామా మార్పు కోసం.

ఫారం 7: ఓటర్ల జాబితాలో పేరును జోడించడానికి లేదా తొలగించడానికి. 

ఫారమ్ 6B: EPIC, ఆధార్ కార్డ్ ఫారమ్ M పొందడానికి

ఫారమ్ 12C: ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలనుకునే కాశ్మీరీ వలస ఓటర్ల కోసం.

ఓటరు గుర్తింపు కార్డు రాకపోతే ఏం చేయాలి?

ఓటరు ID ధృవీకరణ ప్రక్రియకు సమయం తీసుకుంటుంటే, దరఖాస్తు విజయవంతమై, మీకు కార్డు రాకుంటే, మీరు మీ రిఫరెన్స్ నంబర్‌తో DEOని సంప్రదించాలి. 
 
డిజిలాకర్‌లో ఓటర్ ఐడీని అప్‌లోడ్ చేయడం ఎలా? 

డిజిలాకర్ ద్వారా ఓటర్ ఐడి కార్డ్‌ను ఎలా అప్‌లోడ్ చేయాలి... ఇ-ఎపిక్ కార్డ్‌ని ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా ఓటర్ సేవా పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్‌లో డౌన్‌లోడ్ చేసిన ఇ-ఎపిక్ కార్డ్ PDFని అప్‌లోడ్ చేయాలి. 

దరఖాస్తుకు అర్హత: 

దరఖాస్తుదారుడి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. వ్యక్తి మంచి మానసిక స్థితిలో ఉండాలి. వ్యక్తి క్రిమినల్ రికార్డ్ కలిగి ఉండకూడదు. ఫారం 6 నింపి పేర్కొన్న పత్రాలను సమర్పించాలి.
ప్రభుత్వం లేదా ప్రభుత్వం ఆమోదించిన వెబ్‌సైట్‌లు, కేంద్రాల ద్వారా ఓటరు ID కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందించిన పుట్టిన తేదీ, పేరు, చిరునామా, ఇతర వివరాలను సరిగ్గా ఫిల్‌ చేయాలి. అందించిన సమాచారం చట్టబద్ధంగా ఉండాలి. మొత్తం సమాచారం సరిగ్గా నమోదు చేశారో లేదో తనిఖీ చేయాలి. 


దరఖాస్తు కోసం అర్హత: 

ప్రమాదవశాత్తూ నా ఓటరు గుర్తింపు కార్డు పొందకపోతే నేను ఏమి చేయాలి?

అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించి ఫామ్‌6ని సమర్పించాలి. ఇతర వివరాలతో పాటు మీ రిఫరెన్స్ నెంబర్‌ను అందించండి. అనంతరం 'ట్రాక్ స్టేటస్' సెలక్ట్ చేసుకోవాలి వెంటనే మీ అప్‌డేట్ చేసిన అప్లికేషన్ కనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఓటర్ ఐడి కార్డును అందుకుంటారు.

డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఎవరు జారీ చేస్తారు?

జాతీయ ఓటరు దినోత్సవాన్ని జనవరి 25న జరుపుకుంటారు. 2021 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)ఎలక్ట్రానిక్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (e-EPIC) అని పిలిచే డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును విడుదల చేసింది. ఇ-ఎపిక్ అనేది ఇ-ఆధార్ కార్డ్‌ని పోలి ఉంటుంది. PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంది. వ్యక్తులు తమ పాత ఓటరు గుర్తింపు కార్డులను పోగొట్టుకుంటే, రూ.25 చెల్లించి డూప్లికేట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ ఓటర్ ఐడీని ఎలా పొందాలో పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

గుర్తింపు లేకుండా ఓటరు ఓటు వేయవచ్చా?

భారతదేశంలో ఓటు వేయడానికి అర్హత పొందాలంటే, ఒక వ్యక్తి తనను తాను నమోదిత ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఒక వ్యక్తి అదే ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ నమోదు చేసుకోవచ్చు. వ్యక్తి ఇప్పటికే నమోదిత ఓటరు అయితే, అతను లేదా ఆమె ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయవచ్చు. వ్యక్తి తన ఓటరు ID కార్డును కలిగి లేకున్నా కింద పేర్కొన్న ఐడీ కార్డులు ఉంటే సరిపోతుంది. 

పాన్‌ కార్డ్‌, ఆధార్ కార్డ్, పోస్టల్‌ శాఖ జారీ చేసిన పాస్‌బుక్‌, కార్మిక మంత్రిత్వ శాఖ యొక్క MNREGA (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉపాధి కార్డ్) పథకం కింద జారీ చేసిన స్మార్ట్‌ కార్డ్‌, ఫోటోతో కూడిన పెన్షన్ ఆర్డర్ . ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్‌లు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొదలైన వారికి జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. 

ఇది కూడా చదవండి: పోలింగ్ కేంద్రం అంటే ఏమిటి? ఇంతకీ ఓటు వేసే విధానం తెలుసా? 

పాత ఓటరు గుర్తింపు కార్డును కొత్తదానికి మార్చుకోవడం ఎలా?

ప్రభుత్వం ఈ-ఎపిక్ ఓటర్ ఐడీ కార్డు కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నందున, పాత ఓటర్ ఐడీ కార్డు ఉన్నవారు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్‌లోకి లాగిన్ చేయడం ద్వారా కొత్తది పొందవచ్చు. ఇ-ఎపిక్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. 

వివరాలను ఎలా సవరించాలి?

ఆన్‌లైన్ నేషనల్ ఎలక్టోరల్ సర్వీస్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా లేదా సమీపంలోని ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా ఓటరు గుర్తింపు కార్డులో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఇందుకోసం కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.. 

స్టెప్‌ 1: నేషనల్ ఎలక్టోరల్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి

స్టెప్‌ 2: యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ చేయాలి. 

స్టెప్‌ 3: 'ఫామ్ 8'ని ఫిల్‌ చేయాలి.

స్టెప్‌ 4: దానిని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో పాటు అందించాలి. 

స్టెప్‌ 5: ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎన్నికల నమోదు అధికారి (ERO) దరఖాస్తును ప్రాసెస్ చేస్తారు.

NRI ఓటరు గుర్తింపు కార్డు:

ప్రవాస భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోనూ, తమ నియోజకవర్గంలోనూ ఉంటే ఓటు వేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు పొందడానికి, వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

NRI ఓటర్లు ఆన్‌లైన్‌లో ఓటర్ ID కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి.. ముందుగా నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ (NVSP) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి, ఆ తర్వాత విదేశీ ఓటర్‌ నమోద్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే ఫారమ్ 6Aని ఫిల్‌ చేసి కూడా పొందొచ్చు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫామ్ 6Aని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .

దరఖాస్తు చేసిన సంవత్సరం జనవరిలో 18 సంవత్సరాలు నిండిన నాన్-రెసిడెంట్ భారతీయులు ఓటరు ID కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవాస భారతీయులు మరే ఇతర దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండకూడదు. 

ఇది కూడా చదవండి: Vote From Home: ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు.. దానికి ఎవరు అర్హులో ? ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా? 

NRIలు ఆఫ్‌లైన్‌లో ఓటర్ ID కార్డ్‌ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

NRI ఓటర్ ID కార్డ్ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కింది ప్రాసెస్‌ ఫాలో అయితే సరిపోతుంది. ఇందుకోసం ముందుగా అప్లికేషన్‌ ఫామ్‌ను ఫిల్‌ చేసి, సంతకం చేసిన ఫామ్‌ను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కి స్వీయ-ధృవీకరించబడిన పత్రాలతో పాటు సమర్పించాలి. వెరిఫికేషన్‌ పూర్తి అయిన తర్వాత ఈఆర్‌ఓ లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీ పేరు ఎలక్టోరల్ రోల్‌లో చేర్చారా లేదా అన్న విషయాన్ని తెలియజేస్తారు. మీ ఫామ్‌ ఏదైనా కారణంతో తిరస్కరిస్తే ఈఆర్‌ఓ తొలగిస్తుంది. 

ఎలక్టోరల్ రోల్‌లోని ఓటర్ ఐడి కార్డ్ మార్పులు.. 

ఎలక్టోరల్ రోల్‌లోని ఓటర్ ఐడి కార్డ్‌లో పేర్కొన్న వివరాలను సరిదిద్దడానికి క్రింది స్టెప్స్‌ ఫాలో అవ్వాలి.  

ఇందుకోసం ముందుగా నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్‌విఎస్‌పి) సందర్శించాలి. అనంతరం ఎలక్టోరల్ రోల్ హైలైట్ కరెక్షన్‌ ఎంట్రీల సవరణ కింద 'సబ్‌బిమ్‌ ఇయర్‌'పై క్లిక్‌ చేయాలి. సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా లేదా ప్రధాన ఎన్నికల అధికారికి పత్రాలను పంపడం ద్వారా కూడా చేయవచ్చు. పత్రాలను సమర్పించిన తర్వాత, ERO వివరాలను మార్పులు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మార్పులు చేసిన ఓటర్‌ ఐడీ కార్డును మీ అడ్రస్‌కు పంపిస్తారు. 

ఓటరు గుర్తింపు కార్డులో ఏముంటుంది.? 

హోలోగ్రామ్ స్టిక్కర్.

ఆర్డర్ నెం.

కార్డ్ హోల్డర్ పోర్ట్రెయిట్.

ఓటరు పేరు

కార్డ్ హోల్డర్ యొక్క తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి పేరు.

కార్డ్ హోల్డర్ లింగం.

కార్డు జారీ చేసిన తేదీన ఓటరు/కార్డు హోల్డర్ వయస్సు.

అధికారం యొక్క సంతకంతో పాటుగా వ్యక్తి యొక్క పూర్తి చిరునామా కార్డు వెనకాల ప్రింట్ చేస్తారు. 

ఎలక్షన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ ఉపయోగాలు:

ఓటరు ID కార్డ్‌ని క్రింది ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు:

ఈ కార్డ్ వ్యక్తిగత గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. 

ఓటరు గుర్తింపు కార్డు కార్డు హోల్డర్ నమోదిత ఓటరు అని ధృవీకరణగా పనిచేస్తుంది.

కార్డులో దరఖాస్తుదారు సంతకం, ఫోటోగ్రాఫ్, వేలిముద్ర వంటివి ఉంటాయి. 

ఎన్నికల సందర్భంలో, కార్డుదారుడు అనేకసార్లు (మార్కింగ్ ద్వారా) ఓటు వేయకుండా నిరోధించే నిబంధనలు ఉన్నాయి.

అక్షరాస్యత తక్కువగా ఉన్న జనాభా ఎన్నికల అవసరాలకు అనుగుణంగా ఓటరు గుర్తింపు కార్డును రూపొందించవచ్చు.

స్థిర చిరునామా లేని ఓటర్లకు ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.  

ఎన్నికల కార్డ్ ప్రాముఖ్యత:

ఐడీ ప్రూఫ్‌ - ఓటరు ID కార్డ్ భారతీయ పౌరులకు ముఖ్యమైన పత్రం. ఇది ఐడీ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దాదాపు అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, బీమా ప్రొవైడర్లు, టైటిల్ ఏజెన్సీలు, బ్యాంకుల వంటి తనఖా ప్రొవైడర్లు తమ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి వారి ఓటర్ ID నంబర్‌ను అందించమని దరఖాస్తుదారుని అడుగుతారు. 

ఓటింగ్ - ఏదైనా ఎన్నికలలో ఓటు వేయడానికి ఓటర్ ID కార్డ్ అవసరం. మీకు చెల్లుబాటు అయ్యే ఓటరు ID కార్డ్ ఉంటే, మీ స్థానిక ప్రాంతంలోని ఓటర్ల జాబితాలో మీ పేరు ఉంటే, మీరు మీ ఓటు వేయవచ్చు.

ఇతర రాష్ట్రాల ఎలక్టోరల్ రోల్‌లో నమోదు - ఓటరు ID కార్డ్ వ్యక్తులు తమ నివాస స్థలం కాకుండా వేరే రాష్ట్రం యొక్క ఎలక్టోరల్ రోల్‌లో తమ పేరును నమోదు చేసుకోవడానికి అనుమతించే మరొక ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి మరొక రాష్ట్రం నుంచి వలస వెళ్లి, అతని స్థానిక ప్రాంతం/నియోజకవర్గం యొక్క ఓటర్ల జాబితాలో నమోదు కావాలనుకుంటే ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.

ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది: భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటి. దీంతో దేశంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో ముఖ్యమైంది. ఓటరు గుర్తింపు కార్డు ఓటింగ్ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

సమగ్ర గుర్తింపు కార్డు: అవసరాలు తీరినంత వరకు ఏ భారతీయ పౌరుడైనా ఓటరు గుర్తింపు కార్డును జారీ చేయవచ్చు. ఇది భారత ప్రభుత్వంలో ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చేస్తుంది.

మోసగాళ్లను గుర్తించడం సులభం: ఓటర్ ID ఎన్నికల మోసాన్ని దాదాపుగా నిరోధిస్తుంది. ఎవరు ఎక్కువసార్లు ఓటు వేశారో ఇది ట్రాక్ చేయగలదు.

ఓటరు ID కార్డ్: తరచుగా అడిగే ప్రశ్నలు

కొత్త ఓటర్ ID కార్డ్ దరఖాస్తుదారులు SMS ద్వారా వారి స్టేటస్‌ను ట్రాక్‌ చేయవచ్చా?

లేదు, కొత్త ఓటర్ ID కార్డ్ దరఖాస్తుదారులు SMS ద్వారా వారి ఓటర్ ID కార్డ్ అప్లికేషన్ స్టేటస్‌న పొందలేరు. స్టేటస్‌ను ట్రాక్ చేయడానికి ఏకైక మార్గం NVSP వెబ్‌సైట్ లేదా మీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడమే. 

e-EPIC  చెల్లుబాటు ఎంత?

ఓటరు గుర్తింపు కార్డులో ఎలాంటి మార్పులు లేకుంటే e-EPIC కార్డు జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. కానీ ఎవరైనా ఏదైనా సవరణ కోసం దరఖాస్తు చేస్తే, కొత్త కార్డు జారీ చేస్తారు. పాత e-EPIC కార్డ్ చెల్లదు. వ్యక్తి కొత్త e-EPIC కార్డ్‌ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.


నా ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయడంలో సమస్యలు ఉంటే నేను ఏమి చేయాలి?

మీ ఓటరు ID కార్డ్‌ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడంలో మీకు సమస్య ఉంటే, ECI నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ వెబ్‌సైట్‌లో సైన్ అప్ చేసి, ఫిర్యాదును నమోదు చేయండి.

NSVP అంటే ఏమిటి?

నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP) అనేది భారతీయ పౌరులకు ఓటర్ ID కార్డ్ సేవలను అందించే ఆన్‌లైన్ పోర్టల్.

ఫారం 6లో వయస్సు ప్రకటన అంటే ఏమిటి?

ఫారం 6లోని వయస్సు ప్రకటన ప్రకారం, ఓటరు ID కార్డ్ కోసం దరఖాస్తు చేసిన సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

ఓటరు గుర్తింపు కార్డు పొందడానికి ఎంత సమయం పడుతుంది?

ఒకదాని కోసం దరఖాస్తు చేసిన తర్వాత, దరఖాస్తుదారు ఓటరు ID కార్డును స్వీకరించడానికి సుమారు 5 నుంచి  7 వారాల సమయం పడుతుంది.

ఓటరు గుర్తింపు కార్డులో చిరునామా మార్చడానికి ఎంత సమయం పడుతుంది?

దరఖాస్తుదారు మార్పుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఓటరు ID కార్డ్‌లో మార్పులను ప్రాసెస్ చేయడానికి సాధారణంగా 2 నుంచి 3 వారాలు పడుతుంది.

ఓటరు గుర్తింపు కార్డులో నియోజకవర్గాలను మార్చడం ఎలా?

ఫీల్డ్‌ను మార్చడానికి, ఫారమ్ 8A నింపాలి. మీ సమీప ఎన్నికల కార్యాలయానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు.

నేను నా ఓటరు ID కార్డ్ చిరునామాను ఎలా మార్చగలను?

ఓటరు ID కార్డ్ చిరునామాను మార్చడానికి, ఫారమ్ 8A నింపాలి. దీన్ని మీ సమీప ఎన్నికల కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. 

నేను నా ఓటరు నమోదు చిరునామాను ఆన్‌లైన్‌లో మార్చవచ్చా?

అవును, ఓటరు నమోదు చిరునామాను ఆన్‌లైన్‌లో మార్చవచ్చు.

నేను నా ఓటర్ ID కార్డ్ సాఫ్ట్ కాపీని డౌన్‌లోడ్ చేయవచ్చా?

లేదు, ఓటర్ ఐడి కార్డ్ సాఫ్ట్ కాపీని డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాదు.

నా ఓటరు నమోదు కార్డు కనిపించకపోతే నేను ఓటు వేయవచ్చా?

ఓటు హక్కు పొందాలంటే ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి. 

భారత పౌరుడు కాని వ్యక్తి ఓటరు కాగలడా?

ప్రవాస భారతీయుడైన వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.

ఓటరు గుర్తింపు కార్డులో ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే ఏమిటి?

ఫీల్డ్ వెరిఫికేషన్‌లో, సమాచారాన్ని ధృవీకరించడానికి బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) దరఖాస్తుదారుని నివాస చిరునామాను సందర్శిస్తారు.

అడ్రస్‌ ప్రూఫ్‌ఫ కోసం నేను ఏ పత్రాలను సమర్పించాలి?

అడ్రస్‌ ప్రూఫ్‌గా మీరు మీ పాస్‌పోర్ట్, గ్యాస్ బిల్లు, విద్యుత్ బిల్లు లేదా నీటి బిల్లు వంటి యుటిలిటీ బిల్లు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ కాపీని సమర్పించవచ్చు. ఓటర్ ఐడీలో అడ్రస్ ఎలా మార్చుకోవాలో పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఎపిక్ నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే ఏమిటి?

ఎపిక్ నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఒక వ్యక్తి పౌరసత్వం, గుర్తింపును గుర్తించడంలో సహాయపడే అంకెలు, అక్షరాలతో కూడిన సమూహం. ఈ నెంబర్‌ ఎన్నికల సమయంలో ఉపయోగపడుతుంది. EPIC పోర్టల్ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో భాగమైన వ్యక్తి వయస్సుతో పాటు చిరునామ వెరిఫికేషన్‌లో ఉపయోగపడుతుంది. 

ఓటరు గుర్తింపు కార్డుకు చిరునామా రుజువుగా ఆధార్ అంగీకరిస్తుందా.? 

అవును, యుటిలిటీ బిల్లు, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ ఫోటోతో పాటు ఓటరు ID కోసం ఆధార్ వంటి చెల్లుబాటు అయ్యే అడ్రస్‌ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. 

ఎలక్టోరల్ రోల్ అంటే ఏమిటి?

అధికారికంగా, ప్రజాస్వామ్య ఎన్నికలలో అర్హులైన అభ్యర్థుల జాబితాను ఎలక్టోరల్ రోల్ అంటారు లేదా సాధారణంగా 'ఎలక్టోరల్ రోల్' అని పిలుస్తారు.

భారతదేశంలో కనీస ఓటింగ్ వయస్సు ఎంత?

భారతీయ పౌరులకు కనీస ఓటు హక్కు వయస్సు 18 సంవత్సరాలు. ఇది 1988 రాజ్యాంగ 61వ సవరణ చట్టం ద్వారా సవరించారు. RP చట్టం, 1950, సవరించిన ప్రకారం, మార్చి 28, 1989 నుంచి అమల్లోకి వచ్చింది.

ఓటింగ్ అంటే ఏమిటి?

ఓటింగ్ అనేది భారత పౌరులు ప్రభుత్వాన్ని నడపడానికి ఒక ప్రతినిధిని ఎన్నుకునే వారి ప్రాథమిక హక్కును వినియోగించుకునే ప్రక్రియ.

నేను నా EPICని పోగొట్టుకున్నట్లయితే నేను e-EPICని ఎలా డౌన్‌లోడ్ చేసుకోగలను?

మీ e-EPICని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఓటర్ పోర్టల్ లేదా ఎలక్టోరల్ కమీషన్‌ని సందర్శించండి. 

నా దగ్గర EPIC నంబర్ లేదు, ఫారమ్-6 రిఫరెన్స్ నంబర్ ఉంటే నేను e-EPICని డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

అవును, మీరు మీ EPIC నంబర్ లేకుండా కూడా మీ e-EPICని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారం-6 రిఫరెన్స్ నంబర్‌ని ఉపయోగించి e-EPIC నంబర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !