మూడోసారి: నీరవ్ మోడీ బెయిల్ తిరస్కరణ, కారణాలివే!

By rajashekhar garrepallyFirst Published May 9, 2019, 12:34 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీలో) సుమారు రూ. 13వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీకి మూడోసారి బెయిల్ తిరస్కరణకు గురైంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు నీరవ్ బెయిల్‌ను తాజాగా తిరస్కరించంది. 

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీలో) సుమారు రూ. 13వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీకి మూడోసారి బెయిల్ తిరస్కరణకు గురైంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు నీరవ్ బెయిల్‌ను తాజాగా తిరస్కరించంది. 

తదుపరి విచారణ మే 30న ఉంటుందని, విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీని మార్చి 19న అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అప్పటికే రెండు సార్లు అతని బెయిల్ తిరస్కరణకు గురైంది.

అయితే, నీరవ్ మోడీకి చెందిన 860 మిలియన్ డాలర్ల నిధులను భారత దర్యాప్తు సంస్థలు సీజ్ చేయడం వల్లే ఇలా జరిగిందని నీరవ్ తరపు లాయర్‌ చెప్పుకొచ్చారు. బెయిల్‌పై బయటికి వచ్చేందుకు కూడా నిధులు లేవని లాయర్  తెలిపారని బ్లూమ్‌‌బర్గ్ తన కథనంలోపేర్కొంది. 

జడ్జీ ఎమ్మా అర్బుథ్‌నాట్ మాట్లాడుతూ.. నీరవ్ మోడీ తాను సెక్యూరిటీగా అదనంగా 2 మిలియన్ పౌండ్లు ఇస్తామన్నారని, అయితే, సాక్షలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో బెయిల్ నిరాకరించినట్లు తెలిపారు. 

ఫోన్లు, సర్వీర్లను నీరవ్ మోడీ ధ్వంసం చేశారని, అని సహచరులతో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే, భారత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, నీరవ్ మోడీ కరుడుగట్టిన నేరడగాడేమీ కాదని అన్నారు. 

click me!