మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ యాప్‌ క్రాష్.. నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవాలని కస్టమర్లకు రిక్వెస్ట్..

Ashok Kumar   | Asianet News
Published : Jun 15, 2021, 04:11 PM IST
మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ యాప్‌ క్రాష్.. నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవాలని కస్టమర్లకు  రిక్వెస్ట్..

సారాంశం

హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ నేడు క్రాష్ అయ్యింది. దీంతో  యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను కోరింది.  

 న్యూ ఢీల్లీ: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లు  బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్ యాప్‌ నేడు క్రాష్ కావటంతో ఈ సమస్య ఎదురైంది.

ఒక ట్వీట్‌ ద్వారా  ఈ విషయాన్ని వెల్లడిస్తు కస్టమర్లు తమ లావాదేవీలను పూర్తి చేయడానికి నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించాలని హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ  కోరారు.  

“మేము మొబైల్‌బ్యాంకింగ్ యాప్ లో కొన్ని సమస్యలను ఎదురుకొంటున్నాము. మేము దీన్ని పరిశీలిస్తున్నాము, త్వరలో అప్ డేట్ చేస్తాము. వినియోగదారులు లావాదేవీల కోసం నెట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవాలని, అలాగే కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ధన్యవాదాలు, ”అని బ్యాంక్ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

also read మీకు జన్‌ధన్‌ అక్కౌంట్ ఉందా..? అయితే మీకు రూ.2 లక్షల వరకు ఇన్షూరెన్స్ ఫ్రీ..ఎలా అంటే ? ...

హెచ్‌డి‌ఎఫ్‌సి యాప్ లో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై  సోషల్ మీడియాలోచాలా మండి  ఫిర్యాదులు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ వాడటానికి ప్రయత్నించినప్పుడు  వినియోగదారులకు స్క్రీన్‌పై ఒక మెసేజ్ ఫ్లాష్ అయినట్లు చూపిస్తున్నట్లు తెలిపారు.‘డౌన్‌డెక్టర్’ ప్రకారం నేడు ఉదయం 10.45 గంటలకు ఈ సమస్యలు తలెత్తింది. మార్చిలో కూడా నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ యాప్‌లో వినియోగదారులు సమస్యలను ఎదురుకొన్నారు.

గత ఏడాది నవంబర్‌లో ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్ వైఫల్యం కారణంగా బ్యాంకు  ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ వ్యవస్థలో పెద్ద అంతరాయం ఏర్పడింది.

దీని తరువాత, 2020 డిసెంబర్ 3న ఆర్‌బిఐ తన డిజిటల్ 2.0 ప్రోగ్రాం కింద ప్రారంభిస్తున్న అన్ని సేవలపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను నిషేధించింది. ఇదొక్కటే కాదు, ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరగడంతో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా ఆర్‌బిఐ నిలిపివేసింది. 

దీని తరువాత, ఈ ఏడాది మార్చిలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించడంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఫిబ్రవరిలో, ఆర్‌బిఐ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  మొత్తం ఐటి మౌలిక సదుపాయాల ప్రత్యేక ఆడిట్ కోసం ఎక్ష్టెర్నల్ ప్రొఫెషనల్ ఐటి సంస్థను నియమించింది.
 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే