హోం, పర్సనల్, వెహికిల్ లోన్ల పై వడ్డీ రేటు పెంపు.. మే నుండి వరుసగా 5సారి..

Published : Sep 08, 2022, 11:01 AM IST
హోం, పర్సనల్, వెహికిల్ లోన్ల పై వడ్డీ రేటు పెంపు..  మే నుండి వరుసగా  5సారి..

సారాంశం

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక సంవత్సరం ఎమ్‌సిఎల్‌ఆర్ 8.2 శాతానికి పెరగగా, ఓవర్‌నైట్ ఎమ్‌సిఎల్‌ఆర్ 7.9 శాతానికి పెరిగింది. ఒక నెల, మూడు నెలల అలాగే ఆరు నెలల కాలవ్యవధికి ఎమ్‌సిఎల్‌ఆర్ వరుసగా 7.90 శాతం, 7.95 శాతం ఇంకా 8.08 శాతంగా ఉంటుంది.

ఇండియన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ,  ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరోసారి అన్నిరకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ లోన్ పై మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని పెంచింది. దీంతో ఎం‌సి‌ఎల్‌ఆర్ 0.10 శాతం అంటే 10 బేసిస్ పాయింట్ల వరకు పెరిగింది. కొత్త రుణ వడ్డీ రేట్లు 7 సెప్టెంబర్ 2022 నుండి అమలులోకి వస్తాయి.

మే నుంచి హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ను ఐదుసార్లు పెంచింది. హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకు ఈ చర్యతో హోమ్, కారు, పర్సనల్ లోన్ మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేటును పెంచింది. ఆ తర్వాత చాలా బ్యాంకులు  ఎంసీఎల్‌ఆర్‌ను పెంచాయి.

ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానించిన చాలా రకాల బ్యాంకు రుణాలు ఉన్నాయి. వీటిలో హోమ్, కారు, పర్సనల్ లోన్స్ ఉన్నాయి.  

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక సంవత్సరం ఎమ్‌సిఎల్‌ఆర్ 8.2 శాతానికి పెరగగా, ఓవర్‌నైట్ ఎమ్‌సిఎల్‌ఆర్ 7.9 శాతానికి పెరిగింది. ఒక నెల, మూడు నెలల అలాగే ఆరు నెలల కాలవ్యవధికి ఎమ్‌సిఎల్‌ఆర్ వరుసగా 7.90 శాతం, 7.95 శాతం ఇంకా 8.08 శాతంగా ఉంటుంది.

ఎంసీఎల్‌ఆర్‌అనేది కొత్త ఆర్‌బి‌ఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులకు సెట్ చేయబడిన బేస్ రేటు. లోన్ కోసం వడ్డీ రేట్లను నిర్ణయించడానికి  పాత బేస్ రేటు విధానాన్ని భర్తీ చేసింది. ఆర్‌బి‌ఐ ఎంసీఎల్‌ఆర్‌ని 1 ఏప్రిల్ 2016న అమలు చేసింది. చాలా లోన్లు ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ రేటుతో అనుసంధానించి ఉంటాయి, అందువల్ల ఈ‌ఎం‌ఐలను నేరుగా ప్రభావితం చేస్తాయి. 

మేలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను 0.25 శాతం పెంచింది. తరువాత  జూన్‌లో 0.35 శాతం, జూలైలో 0.20 శాతం, ఆగస్టులో 0.10 శాతం పెంచింది. తాజా 10 బేసిస్ పాయింట్ల పెంపు ఎంసీఎల్‌ఆర్‌లో ఐదో పెంపు.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు