
పండగ సీజన్ రాబోతుంది. అయితే బంగారం కొనాలనుకునే పసిడి ప్రియులకు శుభవార్త. భారతదేశంలో 8 సెప్టెంబర్ 2022న 24 క్యారెట్లు అండ్ 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. గురువారం నాటికి ఇండియాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 50,550 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,310గా ఉంది.
గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,770 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 46,550. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 50,620 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 46,400. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.46,400గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.
ఈరోజు వెండి ధర గురుంచి మాట్లాడితే హైదరాబాద్ లో 1 గ్రాము వెండి ధర రూ.58.80, అదే 1 కిలో వెండి ధర రూ.58,800 వెండి పురాతన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధి చెందినది. ప్రస్తుతకాలంలో పెళ్లి వేడుకల్లో సైతం బంగారం తర్వాత వెండికే ప్రాధాన్యతనిస్తున్నారు.