జీఎస్‌టీ వ‌సూళ్ల‌లో హ్యాట్రిక్.. వ‌రుస‌గా ల‌క్ష కోట్ల పైగా ఆదాయంతో సరికొత్త రికార్డు..

By S Ashok KumarFirst Published Jan 2, 2021, 5:22 PM IST
Highlights

 జూలై 2017లో దేశవ్యాప్తంగా పన్ను అమలు చేసిన తరువాత ఇది అత్యధిక వసూళ్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 1 శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.  

వస్తు, సేవాల పన్ను(జి‌ఎస్‌టి) వసూలు 2020 డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో 1.15 లక్షల కోట్ల రూపాయలను తాకింది. జూలై 2017లో దేశవ్యాప్తంగా పన్ను అమలు చేసిన తరువాత ఇది అత్యధిక వసూళ్లు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 1 శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

 కరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభం తరువాత ఆర్థిక వ్యవస్థ వేగంగా  పుంజుకుంటోందన్న అంచనాలకు నిదర్శనం.

 ఆర్థికమంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం డిసెంబరులో జీఎస్‌టీ ఆదాయం ఐజిఎస్‌టి (ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి) రూ .57,426 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ .27,050 కోట్లు), సెస్ రూ .8,579 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.971 కోట్లతో సహా) .సెంట్రల్ జీఎస్టీ రూ .21, 365 కోట్లు, స్టేట్ జీఎస్టీ  రూ .27,804 కోట్లు.

also read ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై భారీ జరిమానా.. ఆర్‌పిఎల్ షేర్లలో అవకతవకలు చేసినట్లు ఆరోపణలు...

 2020 నవంబర్, డిసెంబరులో వసూలు చేసినలో స్థూల జీఎస్టీ ఆదాయం రికార్డు స్థాయిలో 1,15,174 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.  జీఎస్‌టీ వసూళ్ళు రూ.ల‌క్ష కోట్లు దాట‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి. గత ఏడాది ఇదే నెలలో జీఎస్‌టీ ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. 

అంతకుముందు 2019 ఏప్రిల్ నెలలో నమోదైన నెలవారీ జీఎస్టీ సేకరణ రూ. 1,13,866 కోట్లు. 2020 డిసెంబర్ 31 వరకు దాఖలు చేసిన జిఎస్‌టిఆర్-3బీ రిటర్నులు మొత్తం 87 లక్షలు అని ఆర్థిక శాఖ తెలిపింది.

"జిఎస్టి ఆదాయంలో ఇటీవలి రికవరీ ధోరణికి అనుగుణంగా, గత ఏడాది 2020 ఇదే నెలలో జీఎస్‌టీ ఆదాయంతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ.  దేశీయ లావాదేవీల‌ కంటే వస్తువుల దిగుమతి ద్వారా వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ.

దేశీయ లావాదేవీల ద్వారా వ‌చ్చిన ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 8 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
 

click me!