ఇయర్ ఎండ్ 2020: ప్రజలు ఈ సంవత్సరం ఇంటర్నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 ఇవే..

By S Ashok KumarFirst Published Dec 31, 2020, 3:30 PM IST
Highlights

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది భారతీయులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, మరోవైపు విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాసులు. దీంతో ఇంటర్నెట్ వినియోగం కూడా మరింత పెరిగింది. యుట్యూబు వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది.

ఈ ఏడాది 2020 సంవత్సరం మరి కొద్ది గంటల్లో పూర్తవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది భారతీయులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, మరోవైపు విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాసులు. దీంతో ఇంటర్నెట్ వినియోగం కూడా మరింత పెరిగింది.

యుట్యూబు వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఇక ఈ ఏడాది దేశ ఆర్ధిక వ్యవస్థతో పాటు  ప్రజల జీవితల్లో ఎన్నో మార్పులను, అలవాట్లను కూడా తెచ్చి పెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే కరోనా కారణంగా భరతదేశం తీవ్రమైన సంక్షోభనికి గురైంది.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, సమాచారం గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. లాక్ డౌన్ కారణంగా ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఈ సంవత్సరం ఆన్‌లైన్‌లో ఎక్కువగా ప్రజలు దేని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని శోధించారో టాప్-10 వాటి గురించి చూద్దాం... 

1. లాక్ డౌన్ : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి లాక్ డౌన్ అమలు చేయాలని మార్చి 25న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా లాక్‌డౌన్ నాలుగు దశల్లో అమలు చేశారు. మొదటి దశలో లాక్ డౌన్ 25 మార్చి నుండి 14 ఏప్రిల్, రెండవ దశలో 15 ఏప్రిల్ నుండి 3 మే, నాల్గవ దశలో 4 మే  నుండి 17 మే, ఐదవ దశలో 18 మే నుండి 31 మే వరకు కొనసాగింది. దీని తరువాత ప్రభుత్వం జూన్ 1 నుండి దశల వారీగా అన్‌లాక్  ప్రక్రియను ప్రారంభించింది. 

2. ఢీల్లీ ఎన్నికలు : ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢీల్లీ ఎన్నికలపై దేశం మొత్తం దృష్టి సారించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢీల్లీలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఈ భారీ విజయం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

3. భారత్- చైనా సరిహద్దు వివాదం : మేలో ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాల మధ్య సరిహద్దు వివాదం జరిగింది. భారత్, చైనా ఒకవైపు అంటువ్యాధితో పోరాడుతుండగా మరోవైపు దేశ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫలితంగా జూన్ 15నా  రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు ఈ ఘర్షణలో అమరవీరులయ్యారు. ఈ ఘటనలో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించినట్లు సమాచారం. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది.  

4. నిర్భయ కేసు: సుదీర్ఘ నిరీక్షణ తరువాత నిర్భయ కేసులో న్యాయం జరిగింది. వినయ్, పవన్, అక్షయ్, ముఖేష్ అనే నలుగురు దోషులను మార్చి 20న ఉదయం కోర్ట్ ఆదేశాల మేరకు ఉరితీశారు. 

also read 

5. ఢీల్లీలో అతిపెద్ద విషాదం: ఫిబ్రవరిలో ఈశాన్య ఢీల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగినప్పుడు అతిపెద్ద విషాదం జరిగింది. ఈ ప్రాంతాలలో తీవ్రమైన రక్తపాతం, ఆస్తి నష్టం, వరుస హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ హింసలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. అ సమయంలో కోటి రూపాయల విలువైన ఆస్తి కూడా జరిగింది. 

6. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన: ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో కలిసి భారతదేశాన్ని పర్యటించారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రావడం మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వస్థలమైన గుజరాత్‌లో డొనాల్డ్ ట్రంప్ కోసం నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించారు. అహ్మదాబాద్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ట్రంప్ తన కుటుంబంతో కలిసి తాజ్ మహల్ ను కూడా సందర్శించారు.  

7. తుఫాను: మే నెలలో దేశం తీవ్రమైన తుఫానును ఎదుర్కొంది. ఈ కాలంలో తూర్పు తీర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అధిక వేగంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసాయి. ఈ అమ్ఫాన్ తుఫాను కారణంగా చాలా మంది మరణించారు. ఆ సమయంలో గాలి వేగం గంటకు 260 కి.మీ.కు చేరుకుంది, తీరప్రాంతాల్లో భారీ వినాశనం ఏర్పడింది.  

8. అర్నాబ్ గోస్వామి: నవంబరులో రిపబ్లిక్ టివి ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ఒక ఆత్మహత్య కేసులో అరెస్టు చేశారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్యపై దర్యాప్తులో అర్నాబ్ గోస్వామిని 2018 లో మహారాష్ట్ర సిఐడి అరెస్టు చేసింది. అయితే అర్నాబ్‌కు తరువాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

9.  ప్రశాంత్ భూషణ్‌: ఆగస్టు 14న సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్‌ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన రెండు అవమానకరమైన ట్వీట్‌లకు నేరపూరిత ధిక్కారానికి పాల్పడింది. సుప్రీంకోర్టు తన తీర్పును తెలియజేస్తూ, ఆగస్టు 31న శిక్షగా 1 రూపాయి జరిమానా విధించింది.

10. భూకంపం : ఈ సంవత్సరం దేశ రాజధాని ఢీల్లీ అలాగే పరిసర ప్రాంతాల్లో నిరంతర భూకంప ప్రకంపనలు సంభవించాయి. తేలికపాటి భూకంపం ఢీల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాన్ని కదిలించింది. దీంతో ప్రజలు  భయాందోళనకు గురయ్యారు. ఈ కారణంగా ప్రజలు ఢీల్లీలో భూకంప వార్తల కోసం చాలా ఇంటర్నెట్ లో ఎక్కువగా శోధించారు.  

click me!