GST Fraud: రెస్టారెంట్ బిల్లులో జీఎస్టీ మోసం ఎలా గుర్తించాలో తెలుసుకోండి..లేకపోతే భారీగా నష్టపోయే చాన్స్

Published : Mar 16, 2023, 01:40 AM IST
GST Fraud: రెస్టారెంట్ బిల్లులో జీఎస్టీ మోసం ఎలా గుర్తించాలో తెలుసుకోండి..లేకపోతే భారీగా నష్టపోయే చాన్స్

సారాంశం

మీరు ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్ భోజనం చేసిన తర్వాత బిల్లును జాగ్రత్తగా గమనించారా. బిల్లులో జీఎస్టీ రూపంలో చార్జ్ చేయడం గమనించి ఉంటారు. కానీ చాలా రకాల హోటల్స్, రెస్టారెంట్లు జీఎస్టీ పరిధిలోకి రావని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. లేదా ఆ హోటల్ జీఎస్టీ స్లాబులు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొందరు కస్టమర్లను మోసం చేసేందుకు నకిలీ జీఎస్టీని వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. వీరిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

చాలా మంది రెస్టారెంటులో భోజనం చేసిన తర్వాత బిల్లు చెక్ చేయకుండా చెల్లిస్తుంటారు . అయితే ఇటీవల చాలా రెస్టారెంట్లు నకిలీ జీఎస్టీని వసూలు చేస్తూ కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నాయి. మనం తిన్న తర్వాత బిల్లును గమనిస్తే, అందులో జీఎస్టీ పేరిట డబ్బు వసూలు చేయడం గమనిస్తుంటాం. కానీ ఆ డబ్బుతో నిజంగా పన్ను చెల్లిస్తున్నారా, లేదా హోటల్ వారు జీఎస్టీ పేరిట మిమ్మల్ని మోసం చేస్తున్నారా అనే సంగతి తెలుసుకోవాల్సి ఉంటుంది.

గత కొన్ని సంవత్సరాలుగా చాలా రెస్టారెంట్లు, హోటళ్లు కస్టమర్లను మూడు రకాలుగా తప్పుదోవ పట్టిస్తున్నారు. మొదటి రకంలో జీఎస్టీని బిల్లులో చేర్చకుండానే డబ్బును వసూలు చేస్తారు. రెండవది బిల్లులో GST  ఉంటుంది కానీ  GST నంబర్ యాక్టివ్‌గా ఉండదు.మూడవ రకంలో GST నంబర్ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ రెస్టారెంట్ GST బిల్లు పరిధిలోకి రాదు. ఈ విధంగా వినియోగదారుల నుంచి నకిలీ జీఎస్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

Business Ideas: యూట్యూబ్ నుంచి నెలకు రూ. 40 లక్షలు సంపాదిస్తున్న ముంబై యువతి...నమ్మబుద్ధి కావడం లేదు కదూ..

 అదనపు GST ఛార్జీలు పడకుండా ఉండేందుకు వినియోగదారులు బిల్లును జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఏదైనా వ్యత్యాసాలను గుర్తించినట్లయితే, బిల్లు చెల్లించడానికి నిరాకరించాలి, ఫిర్యాదును ఫైల్ చేయడానికి GST హెల్ప్‌లైన్ నంబర్ 18001200232ను సంప్రదించాలి.

అంతేకాకుండా, వినియోగదారులు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. రెస్టారెంట్ లేదా హోటల్ కేటగిరీ ఆధారంగా GST బిల్లు రేట్లు మారుతూ ఉంటాయి. సాధారణంగా ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ, కొన్ని చోట్ల 12 శాతం జీఎస్టీ విధిస్తారు. ఖరీదైన హోటళ్లు లేదా రెస్టారెంట్లు 18 శాతం GST బిల్లును వసూలు చేయవచ్చు. అధిక ఛార్జీలను నివారించడానికి తగిన GST ఛార్జీల స్లాబులను తెలుసుకోవడం చాలా అవసరం.

Business Ideas: మహిళలు రోజుకు 4 గంటలు కష్టపడితే చాలు, నెలకు లక్షన్నర వరకూ సంపాదించే అవకాశం..

వినియోగదారులు తమ రెస్టారెంట్ బిల్లులను జాగ్రత్తగా తనిఖీ చేయాలి, అధిక ఛార్జీలను నివారించడానికి సరైన GST రేట్లను తెలుసుకోవాలి. ఒక రెస్టారెంట్ నకిలీ GSTని వసూలు చేస్తుందని మీరు అనుమానించినట్లయితే, వెంటనే GST హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు