Business Ideas: యూట్యూబ్ నుంచి నెలకు రూ. 40 లక్షలు సంపాదిస్తున్న ముంబై యువతి...నమ్మబుద్ధి కావడం లేదు కదూ..

Published : Mar 16, 2023, 12:57 AM IST
Business Ideas: యూట్యూబ్ నుంచి నెలకు రూ. 40 లక్షలు సంపాదిస్తున్న ముంబై యువతి...నమ్మబుద్ధి కావడం లేదు కదూ..

సారాంశం

ప్రస్తుతం చాలా మంది యూట్యూబ్ ఛానెల్ ద్వారా సంపాదించడం ప్రారంభించారు. యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదించవచ్చో కొందరికి తెలియదు.. అయితే దేశంలోనే యూట్యూబర్‌గా పేరుగాంచిన ప్రజక్తా కోలీ ఆదాయం గురించి ఆరా తీస్తే.. నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమెకు 68.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రూ. 40 లక్షలు సంపాదిస్తున్నారు. ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వివిధ ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ చాలా మందికి ఆదాయాన్ని మాత్రమే కాకుండా పాపులారిటీని కూడా తెచ్చిపెట్టింది. చాలా మంది సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి బాగా సంపాదిస్తున్నారు. ఈ రోజు యూట్యూబ్‌లో వంటకాలు, ఆరోగ్య చిట్కాలు, అందం చిట్కాలతో సహా దొరకని సమాచారం లేదు. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ప్రజక్తా కోలీ ఒకరు. 

2015లో ' MostlySane' అనే యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన కోహ్లీ.. తనదైన శైలిలో ఫన్నీ వీడియోలను పోస్ట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. నేడు ఆమె 68.5 లక్షల మంది ఫాలోవర్లతో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్‌లలో ఒకరిగా ఉన్నారు. అంతే కాదు యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు దాదాపు రూ.40 లక్షలు సంపాదిస్తోంది. ప్రజక్త కోలీ వార్షిక ఆదాయం రూ.4 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

ప్రజక్త కోలీ స్కూల్ డేస్ నుంచి రేడియో జాకీ కావాలనేది ఓ కల. ఈ కలను సాకారం చేసుకోవడానికి, ఆమె ముంబై యూనివర్సిటీలోని ములుండ్ VG వేజ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ ముగిసిన వెంటనే, ఫీవర్ 104 FM ముంబై స్టేషన్‌లో ఇంటర్న్‌గా చేరింది. ఏడాది తర్వాత 'కాల్ సెంటర్' అనే షో హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ షో సరిగా సాగలేదు. దీంతో కోలీ ఈ ఉద్యోగం మానేసి సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. 

విజయవంతమైన యూట్యూబ్ ఛానెల్
కోలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తుంది. ప్రస్తుత సంఘటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంటాయి. బాలీవుడ్‌లోని చాలా మంది పెద్ద సెలబ్రిటీలతో కూడా ఆమె రీల్స్ చేసి అప్‌లోడ్ చేయడం విశేషం. ప్రముఖ నటీనటుల ఇంటర్వ్యూ వీడియోలను కూడా పోస్ట్ చేయడం ఆమె ప్రత్యేకత. 2019లో, ప్రజక్తా కోలీని ఫోర్బ్స్ '30 అండర్ 30' జాబితాలో చేర్చారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి ప్రస్తుతం 75 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

ప్రజక్తా కోలికి వచ్చిన పాపులారిటీ ఆమెను బాలీవుడ్‌కి తీసుకెళ్లింది. ఆమె రాజ్ మెహతా 'జగ్ జగ్ జియో'లో వరుణ్ ధావన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, నీతూ కపూర్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'మిస్ మ్యాచ్‌డ్'లోనూ కోలీ నటించింది. 

కోలీ ఆదాయం ఎంత?
2023 నాటికి ప్రజాక్త కోలీ నికర విలువ రూ. 16 కోట్లు. ప్రతి నెలా ఆమె దాదాపు రూ. 40 లక్షలు సంపాదిస్తుంది.ఆమె వార్షిక ఆదాయం రూ.4 కోట్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు