ఈ వస్తువులపై జీఎస్టీ 28శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు.. 27 నుంచి అమల్లోకి

First Published Jul 22, 2018, 10:37 AM IST
Highlights

కొన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించడంతో పాటు పలు ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది

ఎక్కడికి వెళ్లినా.. ఏం తినాలన్నా.. ఏం కొనాలన్నా జనాలు వణికిపోతున్నారు. ఎంత కొంటే ఎంత జీఎస్టీ కట్టాల్సి వస్తుందోనని.. ప్రజలు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలు, డిమాండ్లు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించడంతో పాటు పలు ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది..

శనివారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.. ఆ వస్తువులపై 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తున్నామని.. కొత్తగా ప్రకటించిన రేట్లు జూలై 27 నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు. 

జీఎస్టీ నుంచి మినహాయింపు పొందిన  వస్తువులు
*శానిటరీ నాప్‌కిన్స్‌
*చీపుర్లలో ఉపయోగించే ముడి సరుకులు
*మార్బుల్స్‌, రాఖీలు, పాలరాయి
*రాళ్లు, చెక్కతో చేసిన విగ్రహాలు
*ఆర్బీఐ జారీ చేసే స్మారక నాణేలు

జీఎస్టీ శాతం తగ్గిన వస్తువులు..
*వెయ్యి రూపాయల లోపు పాదరక్షలపై 5 శాతం
*హ్యాండ్లూమ్‌ దారాలపై 12 నుంచి 5 శాతానికి తగ్గింపు
*లిథియం అయాన్‌ బ్యాటరీలు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, గ్రైండర్లు, ఇస్త్రీ పెట్టెలు, వాటర్‌ హీటర్లు, వాటర్‌ కూలర్లు, పర్‌ఫ్యూమ్స్‌, టాయ్‌లెట్‌ స్ప్రేలు, ఫ్రిజ్‌లు, హేర్‌ డ్రయర్స్‌, వార్నిష్‌లు, కాస్మోటిక్స్‌, పెయింట్లలపై 28 నుంచి 18 శాతానికి తగ్గింపు

click me!