పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

First Published Jul 21, 2018, 4:16 PM IST
Highlights

వరుసగా మూడురోజులు ధర పెరగడంతో పసిడి 31వేల మార్క్‌ దగ్గరకు చేరింది.   శనివారం నాటి మార్కెట్లో రూ. 130 పెరిగి.. 10 గ్రాముల బంగారం ధర రూ. 30,970కి చేరింది. 

మొన్న కాస్త తగ్గినట్టు అనిపించిన బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల సానుకూలతలతో దేశీయ నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో బులియన్‌ మార్కెట్లో పసిడి ధర మరింత పెరిగింది.

 వరుసగా మూడురోజులు ధర పెరగడంతో పసిడి 31వేల మార్క్‌ దగ్గరకు చేరింది.   శనివారం నాటి మార్కెట్లో రూ. 130 పెరిగి.. 10 గ్రాముల బంగారం ధర రూ. 30,970కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడాది కనిష్ఠస్థాయి నుంచి కోలుకోవడంతో ట్రేడర్ల సెంటిమెంట్‌ బలపడిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు వెండి ధర నేడు అమాంతం పడిపోయింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్ల డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర రూ.645 తగ్గింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజి వెండి ధర రూ. 39,255 పలికింది. అంతర్జాతీయంగానూ 0.75శాతం పెరిగిన పసిడి ఔన్సు ధర 1,231.50డాలర్లకు చేరింది. వెండి కూడా 1.47శాతం పెరిగి ఔన్సు ధర 15.51డాలర్లుగా ఉంది.

దేశరాజధాని దిల్లీలో రూ.130 పెరిగి 99.9శాతం స్వచ్ఛత గల పదిగ్రాముల బంగారం ధర రూ.30,970గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.30,820కి చేరుకుంది.  కేవలం రెండు రోజుల్లో  పది గ్రాముల పసిడి ధర రూ.40 పెరిగనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

click me!