పెట్రోల్, డీజిల్ పై సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేటి నుండే అమల్లోకి ..

Published : Mar 15, 2024, 12:26 AM ISTUpdated : Mar 15, 2024, 12:27 AM IST
పెట్రోల్, డీజిల్ పై సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేటి నుండే  అమల్లోకి ..

సారాంశం

అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ ధరలను సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన  సంగతి  మీకు తెలిసిందే.  

గత కొన్ని నెలలుగా ఇంధన ధరతో ఆందోళన చెందుతున్న వాహనదారులకు కేంద్రం తీపి కబురు అందించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కేంద్రం గురువారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున తగ్గించింది. దింతో కొత్త ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వస్తాయి. 

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)లో ఇటీవల కోతలతో అలాగే  కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్  (CNG) ధరలు రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పెట్రోల్ అండ్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి.

అయితే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్‌(X)  పోస్ట్‌లో  “పెట్రోల్ అండ్  డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా, కోట్లాది మంది భారతీయుల కుటుంబ సంక్షేమం అలాగే సౌలభ్యం ఎల్లప్పుడూ తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించుకున్నారు. "అని అన్నారు. 

అతిపెద్ద చమురు సంక్షోభం ఉన్నప్పటికీ, “గత రెండున్నరేళ్లలో భారతదేశంలో పెట్రోల్ ధరలు 4.65 శాతం తగ్గాయి” అని ఆయన పేర్కొన్నారు. మార్చి 14 నాటికి సగటున లీటర్ పెట్రోల్ ధర రూ.94 ఉండగా, డీజిల్ ధర రూ.87గా ఉందని మంత్రి తెలిపారు.

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ ధరలను సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఈ ధరల తగ్గింపు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)ని వంట గ్యాస్ గా  ఉపయోగించే దాదాపు 33 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనుంది.

గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లోని అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) "చాలా కూల్‌గా" ఆలోచించాల్సిన నిర్ణయమని, పెట్రోల్ అండ్  డీజిల్ రిటైల్ ధరలను తగ్గించాలని హర్దీప్ సింగ్ పూరీ గత వారం చెప్పారు.  

ఇంధన విక్రయాలపై లాభదాయకత పరంగా OMCలు ఇంకా పూర్తిగా బయటపడలేదని సూచిస్తూ, డీజిల్ అమ్మకాలపై వారు ఇప్పటికీ తక్కువ రికవరీలను ఎదుర్కొంటున్నారని, అయితే దానిని లెక్కించలేదని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.

ధరల సవరణతో, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.72కి చేరనుంది, ప్రస్తుత ధర లీటరుకు రూ.96.72. అదేవిధంగా ముంబైలో ప్రస్తుత ధర పై రూ.2.10 తగ్గింపుతో  రూ.104.21కి, కోల్‌కతాలో   రూ.2.09 తగ్గి  రూ.103.94కి  అండ్  చెన్నైలో  రూ.1.88 తగ్గింపుతో రూ.100.75 దిగి రానున్న ధరలు.  హైదరాబాద్ లో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.66 అయితే ధరల తగ్గింపుతో రూ.107.66 చేరనుంది. అదే విధంగా దేశంలోని అన్ని మెట్రో నగరాలలో కూడా డీజిల్ ధర దిగి రానుంది. 

PREV
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే