పేటీఎంకు ఊరట.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రద్దయినా యూపీఐ పేమెంట్లు కొనసాగించవచ్చు

By Mahesh K  |  First Published Mar 14, 2024, 7:42 PM IST

పేటీఎం కంపెనీకి ఊరట లభించింది. మార్చి 15వ తేదీతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ రద్దు కానుండటంతో యూపీఐ లావాదేవీల అవకాశాలపై గందరగోళం ఏర్పడింది. కానీ, తాజాగా ఎన్‌పీసీఐ తాజాగా, మంజూరు చేసిన లైసెన్స్‌తో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, యెస్ బ్యాంక్‌ల సహకారంతో పేటీఎం యూపీఐ లావాదేవీలను కొనసాగించడానికి ఆస్కారం ఏర్పడింది.
 


Paytm: డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎంకు ఊరట లభించింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్స్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. తద్వార పేటీఎం పేమెంట్ బ్యాంక్ మార్చి 15తో రద్దయినా.. యూపీఐ లావాదేవీలను కొనసాగించడానికి అవకాశం ఏర్పడింది. అయితే.. కొత్తగా ఈ కంపెనీకి యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్‌లు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్‌లుగా పని చేస్తాయి. యెస్ బ్యాంక్ మెర్చంట్ అక్వైరింగ్ బ్యాంక్‌గానూ పేటీఎం యూపీఐ మెర్చంట్‌లకు పని చేస్తుంది.

ఈ లైసెన్స్ ద్వారా పేటీఎం కస్టమర్లు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని ఇక మీదటా పొందుతారు. అంటే మార్చి 15వ తేదీన పేటీఎం పేమెంట్ బ్యాంక్ రద్దయినప్పటికీ ఈ అవకాశం ఎప్పట్లాగే ఉంటుంది.

Latest Videos

అవసరమున్న చోట ఇప్పుడున్న హ్యాండిల్స్‌ను వెంటనే మైగ్రేట్ చేయాలని పేటీఎంకు ఎన్‌పీసీఐ సూచనలు చేసింది.

యూపీఐ భారత రియల్ టైం పేమెంట్స్ సిస్టమ్. దీని ద్వారా ఏ బ్యాంకు ఖాతాకైనా డబ్బులను పంపించవచ్చు.

click me!